
ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్ జిల్లా జట్ల ఎంపిక
అండర్ 19 బాలికల జిల్లా జట్టు
అండర్ 19 బాలుర జిల్లా జట్టు
పెదవేగి: ఎస్‌జీఎఫ్ అండర్ 19 ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాల, బాలికల జట్ల ఎంపికలు పెదవేగి మండలం లక్ష్మీపురం పంచాయతీ ఎంఆర్‌సీ కాలనీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉత్సాహంగా జరిగాయని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె జయరాజు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం హ్యాండ్‌బాల్ పోటీలు నిర్వహించి, బాలికల జిల్లా జట్టును, బాలుర జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈ పోటీల్లో ప్రిన్సిపాల్ ఏవీ శివప్రసాద్, జిల్లా కార్యదర్శి కె జయరాజు, పీడీలు ఆండాలు, రాజా, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్ జిల్లా జట్ల ఎంపిక