
శ్రీహరి చెంత.. సౌకర్యాలతో క్యూ కాంప్లెక్స్
ద్వారకాతిరుమల: శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా.. అన్ని హంగులతో, ఆలయ అనివేటి మండపం పక్కన నూతన క్యూ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. రూ. 12.50 కోట్లతో జరుగుతున్న ఈ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం ఈ క్యూ కాంప్లెక్స్‌లో 6 కంపార్ట్‌మెంట్లను నిర్మించారు. ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో 250 మంది భక్తులు కూర్చునేందుకు వీలుగా స్టీల్ బల్లలను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి కంపార్ట్‌మెంట్‌లో ఒక డిజిటల్ స్క్రీన్, సెంట్రలైజ్డ్ సౌండ్ సిస్టమ్‌తో పాటు, 5 సీసీ కెమెరాలను అమర్చారు. ఒక్కో దాంట్లో ప్రత్యేకంగా ఒక హై వాల్యూమ్–లో స్పీడ్ (హెచ్‌వీఎల్‌ఎస్) సీలింగ్ ఫ్యాన్‌ను, అలాగే 12 చిన్న సీలింగ్ ఫ్యాన్లను అమర్చారు. క్యూ కాంప్లెక్స్ పక్కనే మరుగుదొడ్లను నిర్మించారు. వాటిలోకి వెళ్లేందుకు వీలుగా ప్రతి కంపార్ట్‌మెంట్‌లో ఒక ఎగ్జిట్ మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే మొత్తం 6 కంపార్ట్‌మెంట్లలో ఒకటి రూ. 200 టికెట్లు పొందిన భక్తులకు, మరొకటి రూ.100 టికెట్లు పొందిన వారికి, మిగిలిన నాలుగు కంపార్ట్‌మెంట్లను ఉచిత దర్శనం భక్తులకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ క్యూ కాంప్లెక్స్ భక్తులకు అందుబాటులోకి రానుంది. అయితే క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లే క్యూ లైన్లను భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తే సరిపోతుంది.
హెచ్‌వీఎల్‌ఎస్ ఫ్యాన్లు ప్రత్యేకం
ప్రతి కంపార్ట్‌మెంట్‌లో ఒకటి ఏర్పాటు చేసిన హెచ్‌వీఎల్‌ఎస్ సీలింగ్ ఫ్యాన్ ప్రత్యేక ఆకర్షణగా, భక్తులకు సౌకర్యవంతంగా నిలవనుంది. ఒక సాధారణ సీలింగ్ ఫ్యాన్‌తో పోలిస్తే 10 రెట్లు దూరాన్ని ఈ పెద్ద ఫ్యాన్ కవర్ చేస్తుంది. ఎక్కువగా వీటిని పరిశ్రమలు, ఎయిర్‌పోర్ట్‌లు, అతి పెద్ద ఫంక్షన్ హాల్స్‌లలో వినియోగిస్తున్నారు. వీటి వల్ల విద్యుత్ కూడా ఆదా అవుతుంది. మెయింటినెన్స్ కూడా ఉండదని అధికారులు చెబుతున్నారు. తక్కువ స్పీడ్‌లో తిరుగుతూ.. ఎక్కువ గాలి ఇవ్వడం వీటి ప్రత్యేకత. అందుకే వీటిని ఏర్పాటు చేశారు.
ప్రత్యేక భద్రత కోసం..
శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శిస్తుంటారు. వారికి సీసీ కెమెరాల ద్వారా జేబుదొంగల నుంచి ఇప్పటికే రక్షణ క ల్పిస్తున్నారు. భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు నూతన క్యూ కాంప్లెక్స్‌లోని ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో 5 సీసీ కెమెరాలను, అలాగే స్వామివారి సేవల వివరాలు, దర్శనం వేళలను తెలియజేసేందుకు ఈ డిజిటల్ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.
నిర్మాణంలో ఉన్న క్యూ కాంప్లెక్స్
క్యూ కాంప్లెక్స్ పక్క నుంచి ఏర్పాటు చేసిన స్టీల్ క్యూలైన్లు
భక్తుల సౌకర్యార్థం రూ. 12.50 కోట్లతో నిర్మిస్తున్న శాశ్వత క్యూ కాంప్లెక్స్
తుది దశకు చేరుకున్న పనులు
కాంప్లెక్స్‌లో మొత్తం 6 కంపార్ట్‌మెంట్‌లు నిర్మాణం
ప్రతి దాంట్లో స్టీల్ బల్లలు, స్క్రీన్, సౌండ్ సిస్టమ్, సీసీ కెమెరాలు, ఫ్యాన్ల ఏర్పాటు

శ్రీహరి చెంత.. సౌకర్యాలతో క్యూ కాంప్లెక్స్

శ్రీహరి చెంత.. సౌకర్యాలతో క్యూ కాంప్లెక్స్

శ్రీహరి చెంత.. సౌకర్యాలతో క్యూ కాంప్లెక్స్

శ్రీహరి చెంత.. సౌకర్యాలతో క్యూ కాంప్లెక్స్

శ్రీహరి చెంత.. సౌకర్యాలతో క్యూ కాంప్లెక్స్