
రేషన్ సరఫరా అవకతవకలపై విచారణ
తాడేపల్లిగూడెం రూరల్: దండగర్ర రేషన్ డిపోలో రేషన్ సరఫరాలో అవకతవకలపై బుధవారం అధికారులు విచారణ చేపట్టారు. దండగర్ర రేషన్ డిపో నిర్వాహకుడు చిక్కాల అంబేడ్కర్ రేషన్ సక్రమంగా పంపిణీ చేయడం లేదని, అవకతవకలకు పాల్పడుతున్నాడని కార్డుదారుల నుంచి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయిస్ డీటీ అన్నపూర్ణ విచారణ చేశారు. రేషన్ డిపో వద్ద స్టాకు బోర్డు లేకపోవడం, కార్డుదారుల ఫిర్యాదుల మేరకు రేషన్‌డీలర్‌పై కేసు నమోదు చేస్తామని డీటీ అన్నపూర్ణ తెలిపారు. రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే అధికారులకు సమాచారం ఇవ్వాలని, వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.
తణుకు అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా ఆర్‌ఎస్‌ఎఫ్‌ఐ, ఏపీఆర్‌ఎస్‌ఏ రోలర్ స్కేటింగ్ హాకీక్వాడ్, కేడెడ్ (అండర్ 12), సబ్ జూనియర్స్ (అండర్ 15) ఎంపికలు బుధవారం తణుకు మాంటిస్సోరీ స్కూలు రింక్‌లో నిర్వహించారు. ఈ ఎంపికల్లో 7గురు కేడెడ్ బాలురు, సబ్ జూనియర్ బాలురు 8 మంది ఎంపికై నట్లు అబ్జర్వర్ షేక్ ఖాసిం తెలిపారు. సానబోయిన స్నేహశ్రీ ఓపెన్ కేటగిరీలో ఎంపికై ంది. వీరంతా వచ్చేనెల 2 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారని వివరించారు. ఈ సందర్భంగా స్కూలు డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు విద్యార్థులకు శిక్షణనిచ్చిన కోచ్ అరెకపూడి భార్గవ్‌ను అభినందించారు.
వీరవాసరం: కిల్కారి సేవల (చిన్నారి చిరునవ్వు)ను గర్భిణులు, బాలింతలు వినియోగించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ గీత బాయ్ అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆశ నోడల్ ఆఫీసర్స్ మీటింగ్‌లో కిల్కారి సేవలపై ఆమె సమీక్ష నిర్వహించారు. కిల్కారి కాల్ ద్వారా వచ్చే ప్రతి సమాచారాన్ని గర్భిణులు, బాలింతలు పూర్తిగా వినేటట్లు చేయాలన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కిల్కారి కాల్ సర్వీస్‌ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. గర్భిణీ అయినా 4 వ నెల మొదలు పుట్టిన బిడ్డకు ఏడాది వయసు వచ్చే వరకు కిల్కారి కాల్స్ వస్తాయని, తద్వారా తల్లీ బిడ్డల ఆరోగ్య క్షేమ సమాచారాన్ని అందజేస్తుందన్నారు. ఆశ నోడల్ ఆఫీసర్లు గర్భిణీలు, బాలింతలకు కిల్కారి సేవలపై అవగాహన క ల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజషన్ అధికారిణి డాక్టర్ సుధా లక్ష్మి, డీపీహెచ్‌ఎన్‌ఓ వెంకట్‌రత్నం, డీసీఎం ఎన్.వెంకట స్వామి, కిల్కారి రీజనల్ ప్రోగ్రాం ఆఫీసర్ బి.రాజు పాల్గొన్నారు.

రేషన్ సరఫరా అవకతవకలపై విచారణ