
పోలీస్ గ్రౌండ్‌లో టెన్నిస్ కోర్టు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో పోలీసులకు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసానికి దోహదపడేలా పోలీస్ అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమించి ఆహ్లాదకరమైన టెన్నిస్ కోర్టును ఏర్పాటు చేయటం అభినందనీయమని ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. బుధవారం రాత్రి ఆయన టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. కొద్దిసేపు పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన టెన్నిస్ ప్రాక్టీస్ చేశారు. ఎంతో కష్టపడి టెన్నిస్ కోర్టును నిర్మించారనీ, పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. టెన్నిస్ కోర్టు నిర్మాణంలో ... ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు పర్యవేక్షణలో ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు, ఆర్‌ఐ జీఎస్‌పీబీ కుమార్, ఆర్‌ఎస్‌ఐ కే.వెంకటేష్, ఆర్‌ఎస్‌ఐ ఎం.భాస్కరరావు, ఆర్‌ఎస్‌ఐ అమలేశ్వరరావు, ఏఎన్‌ఎస్ కానిస్టేబుల్ వీ.వరప్రసాద్ ఆధ్వర్యంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బీ.సుగుణరావు, కానిస్టేబుల్ కే.సూర్యచంద్రరావు, పీవీ రమణరావు, టీ.ప్రతాప్, ఎం.మురళీకృష్ణ, హోంగార్డులు జీ.చిన్ని, కే.శ్రీకాంత్, కే.సాయికుమార్, సీహెచ్ చింతయ్య, వీ.చంద్రతేజ కీలకపాత్ర పోషించారు. వీరందరినీ ఎస్పీ శివకిషోర్ అభినందించారు.