
అరుదైన కవల దూడల జననం
కొయ్యలగూడెం: ఓ ఆవు అరుదైన కవల దూడలకు జన్మనిచ్చింది. కొయ్యలగూడెంలోని మట్టా మురళీకృష్ణకి చెందిన శంకర జాతికి (హెచ్‌ఆర్) చెందిన ఆవు కవల దూడలకు జన్మనివ్వగా ఇందులో ఒకటి దున్న, మరొకటి పెయ్య దూడలు ఉన్నాయి. ఆవును ప్రసవానికి తీసుకువచ్చిన వేళలో కవలదూడలు ఉన్నట్లుగా అనుమానించామని, అయితే సాధారణ ప్రసవానికి లేదా శస్త్ర చికిత్సకు వీలుకాకుండా ఉన్నట్లు పశు వైద్య శాఖ అధికారి బీఆర్ శ్రీనివాస్ తెలిపారు. దీంతో హైడ్రాలిక్ ట్రాక్టర్‌ను తీసుకువచ్చి ఆవును తలకిందులుగా వేలాడ తీసి కడుపులో ఉండగానే దూడలను సరి చేశామన్నారు. అనంతరం ప్రసవించడానికి చికిత్స అందించగా కవల దూడలు జన్మించాయన్నారు. ఈ విధానాన్ని శాసీ్త్రయంగా ఫ్రీమార్టినిజం అంటారని తెలిపారు. ఈ విధానంలో జన్మించిన దూడల్లో పెయ్య దూడ ప్రాణానికి హాని ఉంటుందని, కానీ రెండు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం విశేషం అని చెప్పారు. సిబ్బంది కళింగి నరేష్, కె సతీష్, నరసింహమూర్తి, కార్యాలయ సహాయకుడు కె వెంకట్రావు సహకరించారన్నారు.