
భూసేకరణ వేగవంతం చేయాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ద్వారా భూములు అందించిన వారికి నిర్దేశించిన సమయంలోగా పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణానికి, సెల్‌ఫోన్ టవర్ల నిమిత్తం భూసేకరణపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇంకా అవసరమైన భూములకు సంబంధించి భూసేకరణ ప్రకటనలు వెంటనే జారీ చేయాలన్నారు. భూసేకరణపై జాతీయ రహదారుల నిర్మాణానికి సంబందించి కోర్టులలో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.
నూజివీడు: పెళ్‌లైన ఏడాదికే భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ వివాహిత పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన పొన్నాల శ్రీదేవి కి ఒంగోలుకు చెందిన పల్లంశెట్టి సత్యవర్ధన్‌తో 2024లో వివాహమైంది. వివాహ సమయంలో రూ.10 లక్షల కట్నం, రూ.లక్ష ఆడబిడ్డ కట్నంతో పాటు పెళ్లికి రూ.10 లక్షలు ఖర్చుచేశారు. తన భర్తకు కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుందంటూ మరో రూ.10 లక్షలు కట్నం తీసుకురావాలంటూ భర్తతో పాటు శ్రీదేవి అత్త దైవేశ్వరి, మామ ఏడుకొండలు కొంతకాలంగా వేధిస్తున్నారు. ఈ విషయమై పెద్ద మనుషుల్లో పెట్టినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో బాధితురాలు ఫిర్యాదు చేసింది.