
మద్దిలో పూజలు
జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలను, అన్నప్రాసనలు, వాహన పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు. భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదం అందజేసినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. మధ్యాహ్నం వరకు ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.1,82,316 ఆదాయం వచ్చింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహాయ కమిషనరు తెలిపారు.
తణుకు అర్బన్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఫెన్సింగ్ టీమ్ సెలక్షన్స్ బుధవారం అండర్ –14 విభాగంలో నిర్వహిస్తున్నట్లు ఫెన్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జీఎస్‌వీ కృష్ణమోహన్ తెలిపారు. తణుకు స్టెప్పింగ్‌స్టోన్ స్కూలులో నిర్వహించే ఈ ఎంపికలకు 2012 జనవరి 1 తరువాత పుట్టిన వారై ఉండాలని వివరించారు. ఈ నెల 18న కాకినాడ లక్ష్య స్కూలులో నిర్వహించే ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అండర్–14 సబ్ జూనియర్ చాంపియన్‌షిప్ 2025–26లో పొల్గొనేందుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నామని, ఇతర వివరాలకు 9680234566 నెంబరులో సంప్రదించాలని కోరారు.