
ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొని ఒకరి మృతి
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు నరసాపురం రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం తణుకుకు చెందిన ముగ్గురు యువకులు పేరుపాలెం బీచ్‌కు వెళ్లడానికి బుల్లెట్ వాహనంపై బయలుదేరారు. పాలకొల్లు నరసాపురం రోడ్డులో టిడ్కో గృహాల సముదాయం ఎదురుగా వచ్చేసరికి నరసాపురం నుంచి పాలకొల్లు వైపు వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఈ ద్విచక్ర వాహన్నాఇ ఢీకొట్టడంతో కొల్లి మహేష్‌రాజు (18) అక్కడికక్కడే మృతి చెందాడు. కూచి శరణ్‌శర్మ, సాయి గణేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సాయి గణేష్‌ను మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించినట్లు వైద్యులు తెలిపారు.

ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొని ఒకరి మృతి