ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు

Oct 15 2025 5:56 AM | Updated on Oct 15 2025 5:56 AM

ఉద్యమ

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు

ఆస్పత్రి పూర్తయ్యేదెప్పుడు? రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ ఏఎస్సై మృతి నల్ల బ్యాడ్జీలతో వైద్య సిబ్బంది నిరసన పోలీస్‌ గౌరవాన్ని పెంచేలా నడుచుకోవాలి 3 నుంచి మున్సిపల్‌ వర్కర్స్‌ సమ్మె రిటైర్డ్‌ పంచాయతీ కార్యదర్శి అరెస్ట్‌

న్యూస్‌రీల్‌

వ్యతిరేకతకు కారణాలివీ..

ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌కు మార్చాలి

ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె కొనసాగుతుంది

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

సందేహాలకు తావిస్తోంది

ఆస్పత్రి పూర్తయ్యేదెప్పుడు?
గత ప్రభుత్వంలో మంజూరైన ఆస్పత్రి పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నిలిచిపోయాయి. ఎప్పటికి పూర్తిచేస్తారని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. IIలో u

జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వంతెన వద్ద రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ ఏఎస్సై మృతిచెందారు. దైవదర్శనానికి వచ్చి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. IIలో u

బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

కొయ్యలగూడెం: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ వైద్యులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా కొయ్యలగూడెం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర సిబ్బంది మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ నిరసన చేపట్టారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్‌ చేశారు.

రిసెప్షనిస్టుల వర్క్‌షాప్‌లో ఎస్పీ సూచన

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లాలోని పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్‌ రిసెప్షనిస్టులు స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, పోలీస్‌ గౌరవాన్ని మరింత పెంచేలా నడుచుకోవాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ సూచించారు. ఏలూరు పోలీస్‌ జిల్లా ప్రధాన కార్యాలయంలో మంగళవారం జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల రిసెప్షనిస్టులకు ఒకరోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తమ సమస్యలు, ఇబ్బందులతో న్యాయం కోసం పోలీస్‌స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులకు మెరుగైన సేవలు అందించటం ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. పోలీస్‌ వ్యవస్థ పట్ల ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచేందుకు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ వర్క్‌షాప్‌లో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, కై కలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌, డీసీఆర్‌బీ సీఐ హబీబ్‌ బాషా, మహిళా స్టేషన్‌ ఎస్‌ఐ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నవంబర్‌ మూడో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ సమ్మె చేయనున్నట్టు ఏఐటీయూసీ అనుబంధ ది జోనల్‌ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌కు సమ్మె నోటీసు అందించింది. యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్‌ డాంగే, యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఏ అప్పలరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: రిటైర్డ్‌ పంచాయతీ కార్యదర్శి పి.నాగేశ్వరరావును అరెస్టు చేసినట్టు ఎస్సై షేక్‌ జబీర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం పంచాయతీగా ఉన్న సమయంలో పి.నాగేశ్వరరావు పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. 2011లో జంగారెడ్డిగూడెం నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ అయ్యింది. పంచాయతీగా ఉన్న సమయంలో అప్పట్లో పనిచేసిన కొంతమంది అధికారులు సుమారు కోటి రూపాయల మేరకు పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినట్టు గుర్తించారు. దీనిపై 2013లో డివిజనల్‌ పంచాయతీ అధికారి జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వ్యక్తులు కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో ఇంతకాలం స్టేపై బయట ఉన్నారు. స్టే వేకెంట్‌ కావడంతో ఇటీవల రిటైరైన పంచాయతీ కార్యదర్శి పి.నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ని కోర్టులో హాజరు పరచగా, రిమాండ్‌ విధించినట్టు ఎస్సై చెప్పారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యుత్‌ ఉద్యోగులు ఉద్యమ పథం పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటు ప్రభుత్వం నుంచి గాని అటు విద్యుత్‌ సంస్థల యాజమాన్యాల నుంచి గాని వారికి సానుకూల స్పందన లభించలేదు. జేఏసీ రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపినా ప్రధాన డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. సుమారు 50కి పైగా డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి, విద్యుత్‌ యాజమాన్యాల దృష్టికి తీసుకువెళ్ళినా వారు మొండిపట్టు వీడలేదు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడంపై విద్యుత్‌ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేటి నుంచి సమ్మెకు పిలుపు..

చర్చలు విఫలం కావడంతో తమ సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు సమ్మెబాట పట్టక తప్పలేదు. ఈ నేపథ్యంలో సమ్మె తప్పనిసరి అని విద్యుత్‌ జేఏసీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో విద్యుత్‌ సంస్థలో పని చేసే అసిస్టెంట్‌ లైన్‌మెన్‌, లైన్‌మెన్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, ఏఈలు, ఏఈఈలతో పాటు వివిధ విభాగాల ఉద్యోగులు, కొంతమంది ఈఈలు సైతం పాల్గొననున్నారు. సమ్మెలో దాదాపు సంస్థలో పనిచేసే 80 శాతం మంది పాల్గొననున్నట్టు విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నాయకులు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే విద్యుత్‌ సంస్థలకు చెందిన పలు ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి దశలవారీ ఆందోళన నిర్వహించగా, ప్రస్తుతం తలపెట్టిన నిరవధిక సమ్మెలో జేఏసీలోని భాగస్వామ్య సంఘాలన్నీ పాల్గొనడానికి సిద్ధపడ్డాయి. ఈ మేరకు విద్యుత్‌ ఉద్యోగుల సంఘాల్లోని ప్రధాన సంఘాలైన 1104, 327 సంఘాలతో పాటు ఎస్‌సీ, ఎస్‌టీ ఉద్యోగుల సంఘం, బీసీ ఉద్యోగుల సంఘం, ఓసీ ఉద్యోగుల సంఘం, ముస్లిం మైనార్టీ ఉద్యోగుల సంఘాలు సైతం సమ్మెకు వెళుతున్నాయి.

సమ్మె జరిగితే.. వినియోగదారులకు కష్టాలే

విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెకు వెళితే వినియోగదారులకు కష్టాలు తప్పేలా లేవు. ఏ వీధిలో, ఏ ఇంటిలో కరెంటు పోయినా వెంటనే గుర్తుకు వచ్చే ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌కు ఫోన్‌ చేస్తే నేటి నుంచి స్పందన వచ్చే అవకాశం కనిపించడం లేదు. అధిక లోడ్‌ కారణంగా ఎక్కడ ట్రిప్‌ అయినా వెంటనే వెళ్ళి మరమ్మతు చేసేవారు దొరకరు. మరమ్మతులు చేసేవారు లేక గ్రామాలకు గ్రామాలు చీకటిలో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది.

ఏలూరు టౌన్‌ : ఏలూరు నగరంలో సెయింట్‌ ఆన్స్‌ మహిళా డిగ్రీ కాలేజీ సమీపంలోని యూనియన్‌ బ్యాంకులో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 8.30 గంటల సమయంలో ఇంకా బ్యాంకు తెరవకముందే మంటలు చెలరేగాయి. బ్యాంకులోని ఏసీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా దట్టమైన పొగలు అలముకున్నాయి. ప్రమాదాన్ని గమనించిన సెయింట్‌ ఆన్స్‌ కాలేజీ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారుగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని అగ్నిమాపక శాఖ అధికారి రామకృష్ణ తెలిపారు. బ్యాంకులో అగ్ని ప్రమాద నిరోధక వ్యవస్థ పనిచేస్తూ ఉండడంతో బ్యాంకులో చెలరేగిన మంటలను వ్యాప్తి చెందకుండా నిరోధించినట్టు తెలుస్తోంది.

ఏలూరు కార్పొరేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ఏలూరు (టూటౌన్‌): పారిశుద్ధ్య పనుల నిర్వహణను ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మున్సిపల్‌ కార్మికులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఏలూరు నగరంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ఆప్కాస్‌ విధానం కొనసాగించాలని, కొత్త కార్మికులను ఆప్కాస్‌ ద్వారా నియమించాలని, చనిపోయిన, రిటైర్‌ అయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఏపీ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ)ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు కమిషనర్‌ చాంబర్‌ వద్దకు వెళ్లి బైఠాయించారు. దీంతో కమిషనర్‌ కార్మికుల వద్దకు వచ్చి ప్రస్తుతం ఆప్కాస్‌లో ఉద్యోగాల భర్తీపై నిషేధం ఉన్నందున కార్మికులను తీసుకునేందుకు అవకాశం లేదని, అందువల్ల టీఎల్‌ఎఫ్‌ ద్వారా నియామకాలు చేపడుతున్నామని చెప్పారు. టీఎల్‌ఎఫ్‌ ద్వారా నియామకాలు చేసే వారికి కనీస వేతనాలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ తదితర సౌకర్యాలు అమలు చేస్తామని, భవిష్యత్తులో ఆప్కాస్‌లో నిషేధం ఎత్తివేసిన తర్వాత వీరిని అందులో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్‌ హామీ మేరకు తమ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నామని ఈ సందర్భంగా కార్మికులు తెలిపారు. ధర్నానుద్దేశించి ఏపీ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ధా వెంకట్రావు మాట్లాడారు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణ వల్ల కార్మికులు తమ హక్కులు కోల్పోతారని, జీతాలకు, పని భద్రతకు గ్యారెంటీ ఉండదని, ఈ కార్యక్రమానికి యూనియన్‌ అధ్యక్షుడు లావేటి కృష్ణారావు అధ్యక్షత వహించారు.

విద్యుత్‌ బోర్డ్‌ విభజనకు ముందు ఉద్యోగ సంఘాలతో కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి విరుద్ధంగా గత ఆరు దశాబ్దాల నుంచి అమలులో ఉన్న సర్వీస్‌ నిబంధనలను ఏకపక్షంగా మార్పులు చేయడాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.

త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం బోర్డు విభజనకు ముందు అమలులో ఉన్న సర్వీస్‌ నిబంధనలు, పని ప్రమాణాలు, కారుణ్య నియామకాలు తదితర ప్రయోజనాలు యథావిధిగా కొనసాగుతాయని, ఏవైనా మార్పులు చేయాలంటే ఉద్యోగ సంఘాలతో చర్చించి ప్రస్తుత ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా పరస్పర అవగాహనతో ఒప్పందాలు చేస్తామని చెప్పి ప్రస్తుతం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడాన్ని విద్యుత్‌ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు.

జీతభత్యాల విషయంలో ప్రస్తుతం అమలులో ఉన్న పరస్పర చర్చల ద్వారా వేతనాలు నిర్ణయించే పద్ధతి ఇకముందు ఏర్పడబోయే సంస్థల్లో కూడా కొనసాగిస్తామని త్రైపాక్షిక ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నా, ఇందుకు భిన్నంగా 2022 వేతన సవరణపై నిర్ణయాల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మాజీ ఐఏఎస్‌ అధికారిని నియమించడం ఉద్యోగుల ఆగ్రహానికి గురైంది.

పూర్వం నుంచి అమలులో ఉన్న వెయిటేజ్‌శ్రీ ఫార్ములాను రద్దు చేసి, అతి తక్కువ శాతం (8 శాతం) ఫిట్‌మెంట్‌ బెనిఫిట్‌ను, పాత పద్ధతికి విరుద్ధంగా ఇంక్రిమెంట్లు, మాస్టర్‌ స్కేలును రూపొందించారని, దీనివల్ల ఉద్యోగులు చాలా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

త్రైపాక్షిక ఒప్పందంలోని అన్ని అంశాలూ అమలు చేయాలని డిమాండ్‌

నేటి నుంచి సమ్మెకు విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ పిలుపు

భాగస్వాములవుతున్న పలు విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు

సమ్మెకు వెళితే వినియోగదారులకు విద్యుత్‌ కష్టాలే

విద్యుత్‌ సంస్థల్లో 1999 నుంచి 2004 మధ్య చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఈపీఎఫ్‌ విధానాన్ని జీపీఎఫ్‌ విధానానికి మార్చాలనేది మా ప్రధాన డిమాండ్లలో ఒకటి. విద్యుత్‌ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చులు యాజమాన్యాలే చెల్లించాలి. పది సంవత్సరాల సర్వీసు దాటిన వారందరికీ 2018 రివిజన్లో మంజూరు చేసిన శ్రీసర్వీస్‌ ఇన్సెంటివ్‌శ్రీ పునరుద్ధరించాలి.

– తురగా రామకృష్ణ, విద్యుత్‌ జేఏసీ డిస్కం వైస్‌ చైర్మన్‌

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ప్రభుత్వం దిగివచ్చేవరకూ సమ్మె కొనసాగుతుంది. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏ/సీఆర్‌లను మంజూరు చేయాలి. 2019లో నియమించిన ఎనర్జీ అసిస్టెంట్ల (జేఎల్‌ఎం (గ్రేడ్‌–2)ను రెగ్యులర్‌ జేఎల్‌ఎంలుగా పరిగణించి వేతనాలు తదితర ప్రయోజనాలన్నీ కల్పించాలి. 1993 జూలై ఒకటో తేదీకి ముందు నియమితులైన ఉద్యోగులకు, అంతకు ముందు నియమితులైన ఉద్యోగులకు వేతనాల్లో ఉన్న వ్యత్యాసాలను తొలగించాలి.

– పి.శ్రీనివాస్‌, జేఏసీ ఏలూరు డివిజన్‌ కన్వీనర్‌

భవిష్యత్తుపై ఎంతో ఆశతో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లేబర్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. 2023లో విద్యుత్‌ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమక్షంలో కుదిరిన ఒప్పందం ప్రకారం వారికి యాజమాన్యమే నేరుగా వేతనాలు చెల్లించాలి. 2014, 2018 నూతన వేతనాల్లో అమలు జరిపిన పద్ధతిలో 2022 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 2023 ఆగస్టు 13 వరకు బకాయిలు చెల్లించాలి.

– భూక్యా నాగేశ్వరరావు నాయక్‌, విద్యుత్‌ జేఏసీ డిస్కం కన్వీనర్‌

అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను కూడా యాజమాన్యాలు అమలు చేయకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, అడిషనల్‌ లేబర్‌ కమిషనర్‌ రిపోర్టు ప్రకారం, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. దీర్ఘకాలిక సర్వీసు ఉన్న వారందరినీ విద్యుత్‌ సంస్థల్లో విలీనం చేయాలి. కారుణ్య నియామకాలు కల్పించటంలో కొత్త కొత్త పేర్లు పెట్టి కన్సాలిడేటెడ్‌ పే ఇస్తున్న పద్ధతిని వెంటనే రద్దు చేసి గత నాలుగు దశాబ్దాల నుంచి అమలులో ఉన్న పద్ధతినే కొనసాగించాలి.

– కె.కుమార్‌, జేఏసీ ఏలూరు డివిజన్‌ చైర్మన్‌

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు 1
1/9

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు 2
2/9

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు 3
3/9

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు 4
4/9

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు 5
5/9

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు 6
6/9

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు 7
7/9

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు 8
8/9

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు 9
9/9

ఉద్యమ పథంలో విద్యుత్‌ ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement