
కూటమికి చెడ్డ పేరొస్తుందని..!
● ప్రమాద సూచిక బోర్డు తొలగించిన గుర్తుతెలియని వ్యక్తులు
● మళ్లీ డ్రమ్ము ఏర్పాటు చేసిన స్థానికులు
ద్వారకాతిరుమల: ‘నెమ్మదిగా వెళ్లండి.. నేను కుటుంబాలతో ప్రయాణించే వ్యక్తులను గాయపరుస్తున్నాను. నేను మరొకరికి గాయం కలిగించకముందే దయచేసి నాకు త్వరగా మరమ్మతులు చేయండి’ అంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్టుగా భీమడోలు–ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారిలో కొందరు వ్యక్తులు ఇటీవల ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తాజాగా గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. పంగిడిగూడెం, సూర్యచంద్రరావుపేట, గొల్లగూడెం, ద్వారకాతిరుమలలోని నిమ్మకాయల మార్కెట్ యార్డు ఎదురుగా రోడ్డుపై ఉన్న గోతులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ద్విచక్ర వాహనదారులు తరచూ ఈ ప్రాంతాల్లో ప్రమాదాల బారిన పడి క్షతగాత్రులవుతున్నారు. గతనెల 26న శ్రీఆదమరిస్తే.. ప్రాణాలు గోవిందా!శ్రీ శీర్షికతో దీనిపై శ్రీసాక్షిశ్రీ కథనం ప్రచురించగా, స్పందించిన అధికారులు.. మరుసటిరోజే ఆయా గోతుల్లో మెటల్ డస్ట్ పోశారు. అయితే రెండు రోజులకే రోడ్డు మళ్లీ యథాస్థితికి చేరుకుంది. అధికారులు తూతూ మంత్రంగా గోతుల్లో డస్ట్ పోసి చేతులు దులుపుకున్నారని వాహనదారులు వారి తీరుపై ధ్వజమెత్తుతున్నారు. ద్విచక్ర వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతుండడాన్ని చూడలేక గుర్తు తెలియని కొందరు వ్యక్తులు పొలసానిపల్లి, పంగిడిగూడెం, లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో గోతుల వద్ద పై కొటేషన్‌తో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ బోర్డుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న కారణంగా గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల క్రితం వాటిని తొలగించారు. కూటమికి చెందినవారు తప్ప మరెవరూ వాటిని తొలగించే పరిస్థితి ఉండదని, దీనిపై స్థానికులు అభిప్రాయపడుతున్నారు. బోర్డులను తొలగించినవారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన బాగుండేదని అంటున్నారు. ఈ క్రమంలో పంగిడిగూడెం కుమారీ దాబా సమీపంలో రోడ్డుపై ఉన్న గోతుల వద్ద స్థానికులు మళ్లీ హెచ్చరికగా డ్రమ్మును ఏర్పాటు చేశారు. దీనిపై ఆర్‌అండ్‌బీ ఏఈ భాస్కరరావు దృష్టికి తీసుకెళ్లగా.. బోర్డులను ఎవరు తొలగించారో తెలియదన్నారు. రహదారి నిర్మాణ ంపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించామని చెప్పారు.

కూటమికి చెడ్డ పేరొస్తుందని..!

కూటమికి చెడ్డ పేరొస్తుందని..!