
శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తజన సంద్రమయ్యాయి. దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిశాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు దర్శనం టికెట్లు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.32 లక్షల ఆదాయం లభించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీవారి క్షేత్రంతో పాటు, పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం అధిక సంఖ్యలో వివాహాలు జరిగాయి. దాంతో కొత్త జంటలు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు.

శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం