
పోలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా బాలరాజు
బుట్టాయగూడెం: వైఎస్సార్‌సీపీ పోలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా బాలరాజు విలేకరులతో మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఎంతో నమ్మకంతో సమన్వయకర్తగా నియమించడంపై కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని, సమన్వయంతో ముందుకు సాగుతానని అన్నారు. బాలరాజును పార్టీ మచిలీపట్న ం పరిశీలకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు శాలువా కప్పి అభినందించారు.
భీమవరం: ఉద్యోగుల చెంతకే రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ కార్యాలయం రావడం, దీర్ఘకాలికంగా అపరిష్కతంగా ఉన్న కేసులను పరిష్కరించడం సంతోషమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా యంత్రాంగం రాష్ట్ర ఏజీ కార్యాలయం అధికారులతో ఏర్పాటుచేసిన జీఎఫ్, పెన్షన్ అదాలత్ కార్యక్రమాన్ని ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతి ప్రియ, కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాంతిప్రియ మాట్లాడుతూ మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగుల చెంతకే వచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి నెలా ఏజీ బృందం ఆయా జిల్లాల్లో పర్యటిస్తుందని, వారి వద్ద సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పెన్షన్ అదాలత్‌లో 35 మంది ఉద్యోగులకు పింఛన్ మంజూరు పత్రాలను అందించామన్నారు. పింఛన్ సమస్యల పరిష్కారానికి 20 మంది దరఖాస్తు చేసుకోగా 15 సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారన్నారు. జీపీఎఫ్ సమస్యలపై 55 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఎన్.ఆశ్రిత పట్నాయక్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. రాష్ట్ర ఖజానా, లెక్కల అధికారి ఎన్.మోహనరావు మాట్లాడుతూ త్వరలో పె న్షన్ ప్రతిపాదనల సమర్పణలో పలు మా ర్పు లు రానున్నాయన్నారు. ఎప్పుడైనా జీపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే విధానం రానుందన్నారు.
ఏలూరు (టూటౌన్): భవ్య గుజరాత్ పేరిట ఈ నెల 26 నుంచి వచ్చే నెల 4 వరకు ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో యాత్రను నిర్వహిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఐఆర్‌సీటీసీ ఏరియా మేనేజర్ ఎం. రాజా శుక్రవారం తెలిపారు. యాత్ర రైలు రేణిగుంటలో ప్రారంభమై గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ స్టేషన్ లలో ఆగుతుందన్నారు. మొత్తం 9 రాత్రులు, 10 పగళ్లు సాగుతుందన్నారు. ద్వారకా, సో మనాథ్, అహ్మాదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం, మోధేరా సూర్య దేవాలయం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ వంటి ప్రాంతాలు సందర్శించవచ్చన్నారు. వివరాల కోసం 92814 95848, 92810 30714 నంబర్లలో సంప్రదించాలన్నారు.
ఏలూరు టౌన్: జార్ఖండ్ నుంచి తమిళనాడు ప్రాంతానికి బాలకార్మికులను తరలిస్తున్నారనే సమాచారంతో అప్రమత్తమైన ఏలూరు రైల్వే ఎస్సై శివన్నారాయణ తన సిబ్బందితో దా డులు చేసి బాలలను రక్షించి ఏలూరులోని హోమ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నా యి.. జార్ఖండ్ నుంచి తమిళనాడు ప్రాంతానికి కొంతమంది బాలలను అక్రమంగా తరలిస్తూ ఆయా ప్రాంతాల్లో బాలకార్మికులుగా వినియోగిస్తున్నారని ఏలూరు రైల్వే పోలీసులకు శుక్రవారం రాత్రి సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన ఏలూరు రైల్వే పోలీసులు రైలు ఏలూరు చేరుకోగానే... తమ సిబ్బందితో తనిఖీలు చేసి 14 మంది బాలురను రక్షించారు. మైనర్ బాలలను వివిధ కర్మాగారాల్లో పనిచేసేందుకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు. జార్ఖండ్‌కు చెందిన రూప్‌లాల్ మిర్థ, కెప్టెన్ గగరాజ్, ముఖేష్ కోరా, మహావీర్ ముర్ము, మో నోటోస్ హాజ్ర, డిస్కో దాస్ అనే ఆరుగురు వ్యక్తులను ఏలూరు రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాలలను ప్రభుత్వ వసతి గృహానికి తరలించామని రైల్వే ఎస్సై శివన్నారాయణ తెలిపారు.