
ప్రైవేటీకరణపై కోటి సంతకాల ఉద్యమం
ఏలూరు టౌన్: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని, దీనిలో భాగంగా కోటి సంతకాల సేకరణ చేపడుతున్నట్టు ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ తెలిపారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం కోటి సంతకాల సేకరణ పోస్టర్లను ఆవిష్కరించారు.
ప్రైవేట్‌పరం దారుణం
నూజివీడు: ప్రభుత్వ రంగంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయడం అత్యంత దారుణమని, దీని ద్వారా పేదలకు వైద్యం మరింత దూరమవుతుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. నూజివీడులోని నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం వాల్‌పోస్టర్‌ను ప్రతాప్ అప్పారావు ఆవిష్కరించారు.

ప్రైవేటీకరణపై కోటి సంతకాల ఉద్యమం