
ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలి
తాడేపల్లిగూడెం: విద్యార్ధులు ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలని ఏపీ నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ ఎన్‌వీ రమణరావు అన్నారు. నిట్‌లో శుక్రవారం టెక్రియా 2కె25 అట్టహాసంగా ప్రారంభమైంది. పరిశోధనల్లో విద్యార్థులు కొత్త శిఖరాలను అధిరోహించాలన్నారు. అన్ని విషయాలపై అవగాహన పెంచుకొని నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలన్నారు. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కె.హిమబిందు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలన్నారు. కో–ఆర్డినేటర్‌గా డీన్ డాక్టర్ రాజేశ్వర్‌రెడ్డి వ్యవహరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. టెక్రియా కార్యక్రమ కార్యదర్శి వేదాంత రెడ్డి, డీన్లు డాక్టర్ వి.సందీప్, డాక్టర్ వీరేష్‌కుమార్, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. టెక్రియాలో విద్యార్దులు రూపొందించి ప్రదర్శించిన ప్రదర్శనలు అబ్బుర పర్చాయి.