
పారా త్రోబాల్ జట్టు మేనేజర్‌గా సూర్యనారాయణ
అత్తిలి: ఈఏడాది డిసెంబర్ 15 నుండి 22 వరకు శ్రీలంక లో రత్నాపుర ఇండోర్ స్టేడియంలో మొదటి సౌత్ ఏషియన్ పారాత్రో బాల్ ఛాంపియన్ షిప్–2025 లో పాల్గొనే భారత పారా త్రో బాల్ జట్టు మేనేజర్‌గా అత్తిలికి చెందిన యడ్లపల్లి సూర్యనారాయణ ఎంపికయ్యారని ఆంధ్రప్రదేశ్ పారాత్రో బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గండా కై లాష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఆగస్టు 30, 31 తేదీల్లో కోయంబత్తూర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్న ఆంధ్ర పారా త్రో బాల్ జట్టుకి మేనేజర్‌గా సూర్యనారాయణ వ్యవహరించారని తెలిపారు. ఈ పోటీల్లో ఆంధ్ర పారాత్రో బాల్ జట్టు విజేతగా నిలిచిందని కై లాష్ పేర్కొన్నారు.
జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో బుధవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాస్ పర్యవేక్షణలో కేవీబీ బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది హుండీలను తెరిచి లెక్కింపు నిర్వహించారు. 111 రోజులకు గానూ దేవస్థానంలోని హుండీల ద్వారా రూ.60,84,458, అన్నదానం హుండీ ద్వారా రూ.76,609లు మొత్తం రూ. 61,61,067 ఆదాయం సమకూరినట్లు మద్ది ఆలయ ఈఓ, సహాయ కమిషనర్ ఆర్‌వీ చందన తెలిపారు.

పారా త్రోబాల్ జట్టు మేనేజర్‌గా సూర్యనారాయణ