పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ

Oct 9 2025 3:19 AM | Updated on Oct 9 2025 3:19 AM

పంచాయ

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ పీపీపీ పద్ధతిలో విద్యార్థులను దత్తత తీసుకోవాలి

కై కలూరు: కై కలూరు మేజర్‌ పంచాయతీలో రూ.54 లక్షలు నిధులు దుర్వినియోగమయ్యాయనే ఫిర్యాదుపై డీఎల్‌పీఓ అమ్మాజీ పంచాయతీ కార్యాలయంలో బుధవారం విచారణ చేపట్టారు. రాచపట్నానికి చెందిన సీహెచ్‌ మురళీ ఇటీవల ఏలూరు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎంపీడీఓ ఆర్‌.ఫణింద్ర, పంచాయతీ ఈఓ పీఎన్‌పీ ఆనందభూషణం బాధ్యత వహించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో డీఎల్‌పీఓ అమ్మాజీ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను, ఫిర్యాదుదారుడు సీహెచ్‌ మురళీ సమక్షంలో జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. పూర్తిగా పరిశీలించి నివేదిక ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో సెక్రటరీలు కిరణ్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

సీఎంఎఫ్‌ఎస్‌ ఐడీ నంబర్‌ హ్యాక్‌ చేశారు..

పంచాయతీలో జరిగే లెక్కలు ఫిర్యాదుదారులకు చేరాయంటే కచ్చితంగా సీఎంఎఫ్‌ఎస్‌ ఐడీ నంబరు హ్యాక్‌కు గురైందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్వపు ఈఓ ఆనందభూషణం బుధవారం విలేకరులకు తెలిపారు. పంచాయతీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తాను ఈఓ ఉండగా రెండు విడతలుగా రూ.55 లక్షలు డ్రా చేశానన్నారు. అన్ని సక్రమంగా ఖర్చు చేశానని పేర్కొన్నారు. డ్రెయిన్ల బాగుచేయించడం, కుళాయిల రిపేర్లు చేశానన్నారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు.

ఏలూరు (టూటౌన్‌): పీపీపీ పద్ధతిలో చైతన్య–నారాయణ విద్యాసంస్థలు రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకోవాలని దళిత సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవిప్రకాష్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక ఆర్‌ఆర్‌పేటలోని సంఘ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన పీపీపీ పద్ధతిలో చైతన్య–నారాయణ విద్యాసంస్థల అధినేతలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక 100 మంది చొప్పున 26 జిల్లాల్లో 2600 మంది ఫీజు చెల్లించలేని పేద బడుగు బలహీన వర్గాల నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకుని ఉచిత విద్య అందించాలని కోరారు. వారి జీవితాలను ఉన్నత శిఖరాలకు చేర్చి పేదరికాన్ని నిర్మూలించడానికి తోడ్పడాలని కోరారు. సమావేశంలో చీలి మోహనరావు, దిరుసుపాం కృష్ణమూర్తి, భూసే అనిల్‌ కుమార్‌, పింగుల ఈథియా తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ 1
1/1

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement