బ్రహ్మాండనాయకుని ఉత్సవాలకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మాండనాయకుని ఉత్సవాలకు వేళాయె

Oct 1 2025 10:01 AM | Updated on Oct 1 2025 10:01 AM

బ్రహ్

బ్రహ్మాండనాయకుని ఉత్సవాలకు వేళాయె

క్షేత్రానికి చేరుకునేదిలా..

భక్తులు తరలిరావాలి

ద్వారకాతిరుమల: ద్వారకామహర్షి తపోఫలితం.. శ్రీవారి దివ్య క్షేత్రం. ఈ క్షేత్రంలో గురువారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 8 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శ్రీవారు ఉభయ దేవేరులతో కలసి ఉదయం, సాయంత్రం వేళల్లో పలు వాహనాలపై తిరువీధుల్లో విహరిస్తారు. అలాగే ఆలయ ముఖ మండపంలో స్వామివారు రోజుకో విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికపై ఉదయం నుంచి రాత్రి వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్సవ ఏర్పాట్లకు సంబంధించిన విద్యుద్దీప అలంకారాలు, ఇతర పనులు తుది దశకు చేరుకున్నాయి.

రెండుసార్లు బ్రహ్మోత్సవాలు

మహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీవేంకటేశ్వరస్వామి స్వయంభూ ఈ క్షేత్రంలో పుట్టలో వెలిశారు. అందువల్ల పాదపూజ కోసం పెద్దతిరుపతి నుంచి శ్రీవారిని తెచ్చి స్వయంభూ వెనుక ప్రతిష్టించారు. దాంతో ఒకే అంతరాలయంలో స్వామివారు ద్విమూర్తులుగా కొలువై ఉండటంతో ఏటా వైశాఖ మాసంలో చినవెంకన్నకు, ఆశ్వయుజ వూసంలో ప్రతిష్ఠ స్వామికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరుమల తిరుపతి శ్రీవారు ఇక్కడ ఉండటం వల్ల, అక్కడి మొక్కులు ఇక్కడ తీర్చుకునే సాంప్రదాయం ఉంది. కానీ ఇక్కడ మొక్కులు పెద్ద తిరుపతిలో తీర్చకూడదు. పెద్ద వెంకన్న ఉన్న తిరుమల తిరుపతిని పెద్దతిరుపతిగా, చిన్నవెంకన్న ఉన్న ద్వారకాతిరుమలను చిన్నతిరుపతిగా పిలుస్తారు.

ఉత్సవ విశేషాలు ఇవీ..

● 2 న ఉదయం 9.30 గంటలకు శ్రీవారిని పెండ్లి కుమారునిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేస్తారు. ఆ రోజు రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవం.

● 3 న రాత్రి 9 గంటలకు ధ్వజారోహణ, అనంతరం హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవం.

● 4 న ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం.

● 5 న ఉదయం 7 గంటలకు హనుమద్వాహనంపై స్వామివారి గ్రామోత్సవం, రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వెండి శేష వాహనంపై గ్రామోత్సవం.

● 6 న ఉదయం 7 గంటలకు సింహ వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం, రాత్రి 8 గంటల నుంచి శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం.

● 7 న రాత్రి 8 గంటల నుంచి రధోత్సవం.

● 8 న ఉదయం 10.30 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణ, అనంతరం అశ్వ వాహనంపై గ్రామోత్సవం.

● 9 న ఉదయం 9 గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపుసేవ, శ్రీపుష్పయాగం కార్యక్రమాలు జరుగుతాయి. వీటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

పెరుగుతున్న భక్తుల తాకిడి

దినదినాభివృద్ధి చెందుతున్న ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు పలు అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో భాగంగా కోట్లాది రూపాయల వ్యయంతో జరుగుతున్న అనివేటి మండప విస్తరణ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే భక్తులకు మరిన్ని సౌకర్యాలు సమకూరుతాయి. ఈ క్షేత్రంలో 40 అడుగులకు పైగా ఉన్న గరుత్మంతుడు, అభయాంజనేయుడు, అన్నమాచార్యుని విగ్రహాలు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

రేపటి నుంచి ద్వారకాతిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

6 న రాత్రి తిరుకల్యాణం, 7న రాత్రి రథోత్సవం

రోజుకో ప్రత్యేక అలంకారంలో దర్శనమివ్వనున్న శ్రీవారు

ఉత్సవాలు జరిగే రోజుల్లో ఆర్జిత సేవలు రద్దు

దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రైల్వే మార్గంగుండా ద్వారకాతిరుమలకు 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న భీమడోలు రైల్వేస్టేషన్‌కు చేరుకొని అక్కడినుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోలు ద్వారా క్షేత్రానికి చేరుకోవాలి. ఏలూరు, నరసాపురం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, రాజమండ్రి ప్రాంతాల బస్సుల ద్వారా నేరుగా క్షేత్రానికి చేరుకోవచ్చు.

ప్రత్యేక అలంకారాలు ఇలా..

2న మహావిష్ణువు

3న మురళీకృష్ణ

4న సరస్వతి

5న భూ వరాహ స్వామి

6న మోహిని

7న రాజమన్నార్‌

8న వైకుంఠ నారాయణుడు

9న శయన మహావిష్ణువు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 8 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలి. సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తాం. 6న స్వామివారి కల్యాణం, 7న రథోత్సవాన్ని నిర్వహిస్తాం. ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 2 నుంచి 9 వరకు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నాం. భక్తులు గమనించాలి. – ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి, శ్రీవారి దేవస్థానం ఈఓ

బ్రహ్మాండనాయకుని ఉత్సవాలకు వేళాయె 1
1/3

బ్రహ్మాండనాయకుని ఉత్సవాలకు వేళాయె

బ్రహ్మాండనాయకుని ఉత్సవాలకు వేళాయె 2
2/3

బ్రహ్మాండనాయకుని ఉత్సవాలకు వేళాయె

బ్రహ్మాండనాయకుని ఉత్సవాలకు వేళాయె 3
3/3

బ్రహ్మాండనాయకుని ఉత్సవాలకు వేళాయె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement