
మహీషమ్మకు దసరా శోభ
● నేటినుంచి నూజివీడులో దసరా నవరాత్రులు ప్రారంభం
● 69వ శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
నూజివీడు: దసరా ఉత్సవాలకు పట్టణంలోని శ్రీ కోటమహిషాసురమర్ధని అమ్మవారి ఆలయం ముస్తాబైంది. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. అలాగే ఇటు పొట్టిశ్రీరాములు బొమ్మ సెంటర్ వరకు, అటు మీసేవా కేంద్రం రోడ్డు వరకు రహదారికి ఇరువైపులా విద్యుద్దీపాలను అలంకరించారు. ఈనెల 22వ తేదీ నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు 69వ శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించేందుకు దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా 22న బాలా త్రిపురసుందరీదేవిగా, 23న శ్రీ గాయత్రీదేవి, 24న శ్రీ అన్నపూర్ణాదేవి 25న శ్రీ కాత్యాయనిదేవి, 26న శ్రీ మహాలక్ష్మిదేవి, 27న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, 28న శ్రీ మహాచండీదేవి, 29న శ్రీ సరస్వతీదేవి, 30న శ్రీ దుర్గాదేవి, అక్టోబర్ 1న శ్రీ మహిషాసురమర్ధనిదేవి, 2న శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 29న మూలానక్షత్రం రోజున విద్యార్థులచే శ్రీ సరస్వతీదేవి పూజ నిర్వహించను న్నారు. వచ్చేనెల 2వ తేదీన రాత్రి 8 గంటల నుంచి పోలీసు అధికారులతో శమీపూజ నిర్వహించి 10గంటల నుంచి మేళతాళాలు, కోయనృత్యాలు, చిత్రవిచిత్ర వేషాలు, కోలాటాలతో అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈఓ అలివేణి పర్యవేక్షిస్తున్నారు.

మహీషమ్మకు దసరా శోభ