
కూటమి నేతల కబా్జల పర్వం
పక్కా పథకం ప్రకారం
హెచ్చరించినా పట్టించుకోవడం లేదు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కైకలూరు నియోజకవర్గంలో కూటమి నేతల కబ్జాల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. రోడ్డు పక్కనే పబ్లిక్‌గా రూ.కోట్ల విలువైన భూములు స్వాధీనం చేసుకుంటున్నా అధికారులు నోరెత్తలేని పరిస్థితి. ‘మా జోలికొచ్చారా..! పెద్దాయనకు చెబుతాం..’ అంటూ కూటమి నేతలు బె దిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో రాత్రి వేళ్లలో ప్రభుత్వ భూములను పూడ్చేస్తున్నా కన్నెత్తే సాహసం ఎవరూ చేయడం లేదు.
30 సెంట్లపై కన్ను : నియోజకవర్గంలో రూ.కోట్ల విలువైన ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, ప్రభుత్వ పోరంబోకు భూములు కబ్జాలకు గురవుతున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల్లో ఆక్వా చెరువుల ప్రాంతాల్లో ఇరిగేషన్ భూముల గట్లు రూపంలో కలిపేసు కున్నారు. తాజాగా కై కలూరు నుంచి కోరుకొల్లు రహదారిలో ఇటుకుల బట్టీల వద్ద 30 సెంట్ల ఇరిగేషన్ భూమిని కూటమి మద్దతుదారుడు ఆక్రమించుకున్నాడు. మార్కెట్‌లో ఈ భూమి విలువ సుమారు రూ.కోటి ఉంటుంది. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వద్ద తన పబ్బం గడుపుకోడానికి ఇతరులపై చా డీలు చెప్పే అలవాటున్న వ్యక్తి ఈ ఆక్రమణలో కీలకంగా వ్యవహరించాడనే ఆరోపణలు ఉన్నాయి.
ఇరిగేషన్ సిబ్బందికి మొండిచేయి
ఇరిగేషన్‌శాఖలో చాలా ఏళ్లుగా లస్కర్లు పనిచేస్తున్నారు. కై కలూరు కాల్వగట్టు కోరుకోల్లు రోడ్డులో 20 సెంట్ల ఇరిగేషన్ భూమిలో క్వార్టర్స్ నిర్మించుకుంటామని 2015లో ప్రస్తుత ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉండగా లస్కర్లు కోరారు. అప్పట్లో ఆరుగురు లస్కర్లు రూ.20 లక్షలు ఖర్చుపెట్టి బరంతు సైతం చేయించారు. సమీప సరిహద్దుదారుడు కోర్టును ఆశ్రయించడంతో లస్కర్లకు భూ కేటాయింపు జరగలేదు. అనంతర కాలంలో కై కలూరు నుంచి ఆచవరం టర్నింగ్ వరకు ఇరిగేషన్ భూమిని చాలా మంది ఇష్టానుసారం అక్రమించుకుంటున్నారు. తమ శాఖ భూములను తమ క్వార్టర్స్ కోసం కేటాయించాలని పేరు చెప్పడానికి ఇష్టపడని కింద స్థాయి ఇరిగేషన్ సిబ్బంది కోరుతున్నారు.
రహదారి సమీపంలో ఇరిగేషన్ భూమి వెనుక అర ఎకరం పట్టా స్థలాన్ని కొందరు కొనుగోలు చేశారు. దీని ముందు ఇరిగేషన్ భూమి 30 సెంట్లు ఉంది. ఇరిగేషన్ భూమిలో పంట కాల్వ నుంచి వచ్చే నీటి బోదె ఉంది. ఈ బోదెను ఇరిగేషన్ అధికారుల అనుమతి లేకుండానే సిమెంట్‌తో నిర్మించారు. ఆ పైన మట్టితో పూడ్చారు. ఇప్పుడు వెనుక కొనుగోలు చేసిన అర ఎకరం, ముందు ఇరిగేషన్ భూమి కలిపి ఒక ప్లాట్‌గా త యారయ్యింది. ఇరిగేషన్ అధికారులు ఇది జలవనరుల శాఖకు సంబంధించిన భూమి అని హెచ్చరిక బోర్డులు పెట్టడం, రాత్రికి అక్రమార్కులు వాటిని తీసిపడేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. మీడియా ప్రతినిధులు గురువారం పరిశీలనకు వెళ్లిన తర్వాత ఇరిగేషన్ అధికారులు యథావిధిగా హెచ్చరిక బోర్డులు మళ్లీ పెట్టడం గమనార్హం.
నియోజకవర్గంలో ఇరిగేషన్ భూములను కొందరు ఆక్రమించుకుంటున్నారు. ముందే హెచ్చరిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. హెచ్చరిక బోర్డులు పెడుతున్నా లెక్కచేయడం లేదు. ఇటుకల బట్టీల వద్ద ఇరిగేషన్ భూమి ఆక్రమణపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తాం. రెవెన్యూ అధికారులతో కలిసి ఆక్రమణలను తొలగిస్తాం.
– శిరీష, ఇరిగేషన్ డీఈ, కై కలూరు
రూ.కోటి విలువైన ఇరిగేషన్ భూమి ఆక్రమణ
ప్రజాప్రతినిధి అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు
చోద్యం చేస్తున్న ఇరిగేషన్ అధికారులు

కూటమి నేతల కబా్జల పర్వం

కూటమి నేతల కబా్జల పర్వం