
మిగులు భూముల్లో పోలీసుల జోక్యం వీడాలి
బాలుడి ఆచూకీ గుర్తింపు
ఏలూరు శివారు నిర్మానుష్య ప్రాంతంలో రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడి ఆచూకీ పోలీసులు గుర్తించారు. దర్యాప్తు వేగవంతం చేశారు. 8లో u
జంగారెడ్డిగూడెం: పేదలు సాగు చేస్తున్న ఎర్రకాలువ రిజర్వాయర్ మిగులు భూములకు రక్షణ కల్పించాలని స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద గురువారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు యాగంటి సీత అధ్యక్షత వహించగా జిల్లా అధ్యక్షుడు ఎం.జీవరత్నం, జి.వెంకట్రావు బృందం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జీవరత్నం, వెంకట్రావు మాట్లాడుతూ టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల్లో ఎర్రకాలువ మిగులు భూముల్లో జీవనోపాధి కోసం సాగు చేసుకుంటున్న పేదలకు రక్షణ కల్పించాలన్నారు. ఇరిగేషన్ భూముల్లో పేదలను పోలీస్ యంత్రాంగం బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. ఎర్ర కాలువ మిగులు భూములకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీసుకుని దాంతో చాలా భూములు కొనుగోలు చేసి భూస్వాములు మరలా ఎర్ర కా లువ మిగులు భూములను కాజేసేందుకు అధికార కూటమి నాయకులతో కుమ్మకై ్క కుయుక్తులు ప న్నుతున్నారన్నారు. పేదల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ప్రజల పక్షాన కాకుండా భూస్వాములు పక్షాన ఉండటం సరికాదన్నారు. నాయకులు జి.సూర్యకిరణ్, కె.సుబ్బారావు, పి.పోతురాజు, సీహెచ్ రవి, ఎం. సుధారాణి, కలపాల గాంధీ పాల్గొన్నారు.