
గత ప్రభుత్వంలో రూ.104 కోట్ల సాయం
దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ఇంటి యజమాని మరణిస్తే ఆ కుటుంబానికి బీమా సాయంతో గత ప్రభుత్వం అండగా ఉండేది. ఈ మేరకు 18 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు ప్రమాదవశాత్తు మృతిచెందితే రూ.5 లక్షలు, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు సహజ మరణం పొందితే రూ.లక్ష చొప్పున పరిహారం అందించేవారు. పేద కుటుంబాల వారి పేరిట బీమా సంస్థకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించేది. ఇంటి యజమా ని మృతిచెందితే సచివాలయ సిబ్బంది బాధిత కుటుంబం వద్దకు వెళ్లి బీమా పథకం కోసం ఆన్‌లైన్ చేసేవారు. మట్టిఖర్చుల నిమిత్తం తక్షణ సాయంగా రూ.10 వేలు అందించేవారు. మిగిలిన మొత్తాన్ని నిర్ణీత వ్యవధిలో నామినీ ఖాతాకు జమచేసేవారు. ఈ సాయం భవిష్యత్ అవసరాలకు కొండంత భరోసా అయ్యేది. ఇలా వైఎస్సార్‌సీపీ హయాంలో ఉమ్మడి జిల్లా లోని దాదాపు 6,999 కుటుంబాలకు రూ.104.35 కోట్ల పరిహారం అందించారు.