
తమ్మిలేరుకు భారీగా నీరు
చింతలపూడి: జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. గురువారం అధికారులు 301 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తమ్మిలేరు ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 347.72 అడుగులకు, గోనెలవాగు బేసిన్ 347.45 అడుగులకు చేరుకుందని తమ్మిలేరు ఇరిగేషన్ ఏఈ లాజరుబాబు తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 3 టీఎంసీలు కాగా 0.660 టీఎంసీలకు, గోనెల వాగు బేసిన్ 1.109 అడుగులకు చేరుకున్నట్టు చెప్పా రు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి అలుగుపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో గంటకు 637 క్యూసెక్కుల నీరు ఆంధ్రా కాల్వ ద్వారా ప్రాజెక్టులోకి వస్తుందన్నారు. ప్రాజెక్టులో 350 అడుగుల వరకు నీటి ని నిల్వ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు డీఈ తెలిపారు.
ఏలూరు (టూటౌన్): మున్సిపల్ కార్మికులకు 12వ పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కాలపు జీతాలను విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్.లింగరాజు, డీఎన్‌వీడీ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఏలూరు కార్పొరేషన్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. వేతనాల పెంపు, సమ్మె కాలపు జీతాల విడుదల, ఎక్స్‌గ్రేషియా పెంపు, డీఏ బకాయిలు, సరెండర్ సెలవులు ఎన్‌క్యాష్‌మెంట్, క్లాప్ డ్రైవర్లు తదితర సమస్యలను విన్నవించారు. సీఐటీయూ నాయకులు జె.గోపి, ఎం. ఇస్సాకు, అరుణకుమారి పాల్గొన్నారు.
భీమవరం: భీమవరంలో ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ సీపీఎం లంకపేటశాఖ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. సీపీఎం పట్టణ నాయకుడు ఎం.వైకుంఠరావు మాట్లాడుతూ ప్రభుత్వ భూ ముల్లో పేదలకు పట్టాలిస్తామని కూటమి ప్ర భుత్వం చేసిన హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. గతనెలలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసినా అధికారులు కనీసం విచారణ చే యకపోవడం దారుణమన్నారు. సొంతిల్లు లేక పేదలు నానా అవస్థలు పడుతున్నారన్నా రు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.

తమ్మిలేరుకు భారీగా నీరు

తమ్మిలేరుకు భారీగా నీరు