
శివయ్య ఆలయాన్ని ముంచెత్తిన గంగమ్మ
ద్వారకాతిరుమల: మండలంలోని తిరుమలంపాలెంలో శ్రీ భ్రమరాంబ ఆది మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని సోమవారం గంగమ్మ ముంచెత్తింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఆలయ ఆవరణలోకి, అలాగే శివయ్య, అమ్మవారి గర్భాలయాల్లోకి భారీగా నీరు చేరింది. పురోహితుడు ఆ నీటిలోంచే స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంతం లోతట్టుగా ఉండటం వల్ల వర్షపు నీరు ఆలయంలోకి చేరుతోందని, దేవస్థానం అధికారులు స్పందించి, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

శివయ్య ఆలయాన్ని ముంచెత్తిన గంగమ్మ

శివయ్య ఆలయాన్ని ముంచెత్తిన గంగమ్మ