
కేసులు పెట్టడం సరికాదు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే పత్రికా రంగంపై కేసులు పెట్టే ధోరణి మంచిది కాదు. ప్రచురితమైన వార్తా కథనాల్లో ఏమైనా అవాస్తవాలు దొర్లితే న్యాయపరంగానో, ఇతర మార్గాల్లోనో సంప్రదించాలే తప్ప విలేకరులపై కేసులు నమోదుచేసే పరిస్థితులు తీసుకురాకూడదు. సమాజంలో పత్రికా స్వేచ్ఛకు గండి కొట్టేలా ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోరాదు. నాలుగో స్తంభంగా ఉన్న పాత్రికేయ వ్యవస్థకు సమాజంలో జరుగుతున్న విషయాలను తెలిపే హక్కు ఉంటుంది. – వంక రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ