
13 మందికి పదోన్నతులు
ఏలూరు (మెట్రో) : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు 13 మందికి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులను చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ సోమవారం అందజేశారు. జెడ్పీ సీఈవో శ్రీహరి, ఏవో రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు టౌన్: ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదికలో బాధితుల నుంచి 48 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, మోసాలు, ఆర్థిక లావాదేవీలపై ఫిర్యాదులు ఉన్నాయి. ఎస్పీ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో మోసాలకు పాల్పడే నేరగాళ్లు ఎక్కువ అయ్యారని, సెబర్ నేరాలపై వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, 1930 టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు పాల్గొన్నారు.