
టీడీపీ నేత దౌర్జన్యంపై ఫిర్యాదు
ఏలూరు (టూటౌన్): నా భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి షెడ్‌ను కూల్చి వేసి దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బుట్టాయగూడెం మండలం సూరపావారిగూడెంకు చెందిన బల్లా భూలక్ష్మి జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తెల్లం వెంకటేశ్వరరావు దౌర్జన్యంగా తన భూమిలోకి ప్రవేశించి రూ.4 లక్షల విలువైన షెడ్ ధ్వంసం చేసారని ఆరోపించారు. గత నెల 26న అక్రమంగా చొరబడి షెడ్డు కూల్చివేసి పంటను నాశనం చేశారన్నారు. నిందితులు తనపై దాడి చేశారన్నారు. తనకు ఆ భూమే జీవనాధారమని వారి అరాచకాల వల్ల మొత్తం రూ.13.90 లక్షలు నష్టపోయినట్లు చెప్పారు.