
పత్రికా స్వేచ్ఛ అణ చివేత
తమ వైఫల్యాలను ప్రశ్నించి, నిజాలు వెలికితీస్తున్న ‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతోంది. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం హేయమైన చర్య. పత్రికలపై కేసులు బనాయించడం దేశంలో ఎక్కడా చూడలేదు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్య్రాన్ని పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం దారుణంగా అణచివేస్తోంది. తక్షణమే సాక్షి యాజమాన్యం, పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి.
– కవురు శ్రీనివాస్, ఎమ్మెల్సీ