
స్వచ్ఛంద సంస్థల సేవలు ప్రశంసనీయం
ఏలూరు (టూటౌన్): స్వచ్ఛంద సంస్థలు సమాజానికి అందిస్తున్న సేవలు విశేషమైనవని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాధికార సంస్థ భవనంలో స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు, బాలలకు న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే కార్యకలాపాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థలు సమాజానికి అందిస్తున్న సేవలు విశేషమైనవని న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయసేవలపై అవగాహన కల్పించడంతో ఎంతో కృషి చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సూర్య చక్రవేణి, సీడీపీఓ తులసి, చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
డీఎల్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి కె.రత్నప్రసాద్