
మన్యంలో ప్రకృతి సేద్యం
మన్యంలో ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. ఖరీఫ్‌లో 10వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. 8లో u
బుట్టాయగూడెం: కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు బుధవారం మధ్యాహ్నం కాస్త ఉపశమనం లభించింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ ఉన్నప్పటికీ మధ్యాహ్నం ఒక్కసారిగా కారుమబ్బులు కమ్మి సుమారు రెండు గంటలు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందారు.
రూ.70 లక్షల నిధుల దుర్వినియోగం
ఏలూరు (టూటౌన్): ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సంతకాన్ని ఫోర్జరీ చేసి 2019 నుంచి ఇంతవరకు దాదాపు రూ.70 లక్షల మేర నిధులు దుర్వినియోగంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీనికి కారకుడైన ఎస్సీ కార్పొరేషన్ జూనియర్ అసిస్టెంట్ పవన్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. తాజాగా రూ.6 లక్షలు విత్‌డ్రా చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్సీ కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేసినందుకు పవన్ కుమార్‌ను బుధవారం విధుల నుంచి కలెక్టర్ వెట్రిసెల్వీ సస్పెండ్ చేశారు. సొమ్ము దుర్వినియోగంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.