
అన్నదాతకు అండగా
న్యూస్‌రీల్
వైఎస్సార్‌సీపీ అన్నదాత పోరుకు అడుగడుగునా ఆటంకాలు ఏలూరు, జంగారెడ్డిగూడెంలో పదుల సంఖ్యలో చెక్‌పోస్టులు సెక్షన్ 30 పేరుతో నిరసన ప్రదర్శనలు అడ్డుకునేందుకు పోలీసుల యత్నం పోలీసుల ఆంక్షలు దాటుకుని పోరుబాట విజయవంతం ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయాలకు భారీగా తరలిన పార్టీ శ్రేణులు నూజివీడులోనూ అన్నదాత పోరు విజయవంతం
సీసలిలో 144 సెక్షన్
సీసలిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మంగళవారం నుంచి 15 రోజులపాటు గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 8లో u
ఆంక్షలు అధిగమించి..
సాగును నిర్వీర్యం చేస్తూ కూటమి దగాకోరు పాలనపై కర్షకులు కదం తొక్కారు. అన్నదాత పోరు విఫలయత్నానికి ఆంక్షల రూపంలో ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా లెక్కచేయకుండా విజయవంతం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతల ఆధ్వర్యంలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు ఆర్డీఓ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు.
బుధవారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
తణుకు అర్బన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం మాజీ మంత్రి, రీజనల్ కో–ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్‌కుమార్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ పరిపాలనపై చర్చించినట్లు కారుమూరి తెలిపారు.
దెందులూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో మంగళవారం దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కలిశారు. రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెట్‌ను నిరసిస్తూ అన్నదాత పోరు కార్యక్రమం జరిగిన తీరు వివరించారు. దెందులూరు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలపై వివరించారు.
కాలం చెల్లిన మందుల వాడకం
వేలేరుపాడు: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వైద్య ఆరోగ్య శాఖ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. రోగులకు గడువు తీరిన మందులను వినియోగిస్తోంది. వేలేరుపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీకి గడువు తీరిన మందులు ఇచ్చిన సంఘటన వెలుగు చూసింది. వేలేరుపాడు మండలంలోని పూచిరాల కాలనీకి చెందిన గర్భిణీ గత నెలలో వైద్య పరీక్షల నిమిత్తం వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళింది. పరీక్షల అనంతరం వైద్యుడు మందులు రాయగా రాయగా, ఆరోగ్య కేంద్రంలోని ఫార్మసిస్ట్ మందులు ఇచ్చారు. మందులను ఇంటికి తీసుకెళ్ళిన మహిళ మాత్రలను వేసుకునేందుకు సిద్ధమై తన భర్తకు చూపించింది. అనుమానం వచ్చిన భర్త మాత్రల షీట్‌పై ఉన్న తయారీ, గడువు ముగిసిన తేదీలు గమనించాడు. ఆ మందుల గడువు జులైలోనే తీరిపోయింది. దీంతో గర్భిణీ మహిళ మాత్రలు వేసుకోలేదు. ఈ విషయాన్ని మంగళవారం వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ సురేష్‌కు చూపించింది. గడువు తీరిన మందులు వేసుకొని, మా ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారించిన డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ ఫార్మాసిస్ట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇలాంటి తప్పులు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.
ఏలూరు(మెట్రో): మోతాదుకు మించి ఎరువుల వినియోగం వలన కలిగే అనర్థాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కలిగించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి వ్యవసాయాధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎరువుల సరఫరా, పంపిణీలపై మంగళవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరతా లేదని, రైతుల అవసరాలకు సరిపడా ఉన్నాయని, అయినప్పటికీ సాగులో నిర్దేశించిన మోతాదుకు కంటే ఎక్కువ పరిమాణంలో వినియోగం కారణంగా భూసారం దెబ్బతినడంతో పాటు, మనుషుల ఆరోగ్యాలపై ప్రభావం చూపుతాయని రైతులకు అవగాహన కలిగించాలన్నారు. నానో ఎరువుల వినియోగంపై కూడా అవగాహన కలిగించాలన్నారు. ఈ సందర్భంగా సొసైటీలలో ప్రస్తుతం ఉన్న ఎరువుల నిల్వలు, రాబోయే వారానికి అవసరమైన ఎరువుల వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరును అష్టదిగ్బంధం చేశారు. చిన్న పట్టణమైన జంగారెడ్డిగూడెంలో అడుగడుగునా పోలీసులను మోహరించారు. చెక్‌పోస్టులు, బారికేడ్లతో రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులను నిలువరించే యత్నాలు తెల్లవారుజామున నుంచే మొదలుపెట్టారు. సెక్షన్ 30 అమలులో ఉందని నిరసన చేయవద్దంటూ పార్టీ ఇన్‌చార్జులకు నోటీసులు, 41 నోటీసుల పేరుతో హౌస్ అరెస్టులు చేశారు. అన్నింటిని దాటుకుని వైఎస్సార్‌సీపీ తలపెట్టిన అన్నదాత పోరు జిల్లాలో విజయవంతమైంది. పోలీసుల అణచివేతలపై తిరగబడిన పార్టీ శ్రేణులు, రైతులు వేలాదిగా తరలివచ్చి నిరసన తెలిపారు.
వైఎస్సార్‌సీపీ మంగళవారం నిర్వహించిన అన్నదాత పోరు ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడులో విజయవంతంగా సాగింది. ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు, పోలీసుల హడావుడితో రైతు ఉద్యమాన్ని అణిచివేయాలని సర్కారు అనేక అడ్డదారులు తొక్కింది. వాటిన్నింటిని చేధించి పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. ప్రధానంగా ఏలూరు నగరంలో అశోక్‌నగర్, అమీనాపేట, పాత బస్టాండ్, జూట్ మిల్లు సెంటర్, పంపుల చెరువు రోడ్డు, మాదేపల్లి రోడ్డు, ఆశ్రం కాలేజీ సెంటర్, సత్రంపాడు సెంటర్ వద్ద పోలీసుల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కై కలూరు, దెందులూరు, ఉంగుటూరు నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లలో వచ్చేవారిని పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. మరోవైపు అంతటితో ఆగకుండా అనేక చెక్‌పోస్టుల వద్ద రవాణాశాఖాధికారులు కూడా పోలీసులతో జత కలిసి వాహనాలను తనిఖీ చేయించి కేసుల పేరుతో అలజడి సృష్టించారు. ముఖ్యనేతలందరికీ నోటీసులు పంపారు. వీటన్నింటిని దాటుకుని అశేష జనవాహిని ఏలూరు ఫైర్‌స్టేషన్‌కు చేరుకుంది. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొంతసేపు అక్కడ ఆందోళన నిర్వహించి పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, సమన్వయ కర్తలు పుప్పాల వాసుబాబు, కొఠారు అబ్బయ్యచౌదరి, మామిళ్ళపల్లి జయప్రకాష్, పార్టీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, నగర నేతలు కలిసి ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. అన్నదాత సమస్యలను శాంతియుత వాతావరణంలో ప్రభుత్వానికి తెలియజేయడానికే నిరసన కార్యక్రమం నిర్వహించామని దీన్ని పోలీసుల ఆంక్షలతో అడ్డుకోవడం సర్కారు నీతిమాలిన చర్య అని జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. నూజివీడులో పార్టీ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప అప్పారావు నేతృత్వంలో కార్యాలయంలో సమావేశం నిర్వహించి నిరసన ప్రదర్శనగా పార్టీ శ్రేణులు సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందించారు.
జంగారెడ్డిగూడెం అష్టదిగ్బంధం
గతంలో ఎన్నడూ లేని విధంగా జంగారెడ్డిగూడెంను పోలీసు అష్టదిగ్బంధం చేశారు. ఏలూరు రోడ్డు, శ్రీనివాసపురం, జీలుగుమిల్లి రోడ్డు, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల నుంచి రైతులు, పార్టీ శ్రేణులు రాకుండా అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులను జంగారెడ్డిగూడెం బయటే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పార్టీ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ వంకా రవీంధ్రనాఽథ్, పార్లమెంట్ ఇన్‌చార్జి కారుమూరి సునీల్, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి, పోలవరం సమన్వయకర్తలు కంభం విజయరాజు, తెల్లం రాజ్యలక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు వాసిరెడ్డి మధుతో పాటు మరికొందరు ముఖ్య నేతలు పట్టణంలోని ఆర్‌డీఓ కార్యాలయానికి భారీ సంఖ్యలో వచ్చి వినతిపత్రం అందచేశారు. జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ నుంచి ఆర్‌డీఓ సెంటర్ వరకు ఆరు చోట్ల పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేసి హడావుడి చేసినప్పటికీ భారీగా శ్రేణులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నాయి.
కారుమూరి సునీల్‌కుమార్,
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి
రైతులకు యూరియా అందకుండా ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. చంద్రబాబు వరి పండించక్కర్లేదు అని చెప్పడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటున్నారు.. ఆయన మాటలు, చేష్టలు అర్థం కాకుండా ఉన్నాయి. రైతుల కోసం మరిన్ని పోరాటాలు చేస్తాం. సినిమా టిక్కెట్లకు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తుంది గాని, పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైంది. దోచుకో... దాచుకో అనేది కూటమి లక్ష్యంగా ఉంది.
తెల్లం బాలరాజు, పోలవరం మాజీ ఎమ్మెల్యే
అన్నదాత పోరు చూసి చంద్రబాబు సిగ్గుపడాలి. రైతులు రోడ్డెక్కారంటే సిగ్గు చేటు. యూరియా అందించలేక కూటమి చేతులెత్తేసింది. ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా ఎగ్గొట్టారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర విడనాడాలి. బ్లాక్ మార్కెట్‌లో యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. యూరియా కోసం క్యూలో నిల్చుంటే వారిని కించపరిచేలా మాట్లాడుతున్నారు. రైతులను అవమానిస్తే రైతుల తడాఖా చూపిస్తారు.
కంభం విజయరాజు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ప్రజలకు చేసింది శూన్యం. రైతు కంట కన్నీళ్లు పెట్టిస్తోంది కూటమి ప్రభుత్వం. రైతు కళ్లలో నీరు తెప్పించిన ఏ ప్రభుత్వమైనా కూలిపోక తప్పదు. అన్నదాతకు అండగా ఉండాలని కోరుతున్నాం. అన్నదాత సుఖీభవ గత ఏడాది, ఈ ఏడాది కలిపి మొత్తం రూ.40 వేలు రైతులకు ఇవ్వాలి. యూరియాను బ్లాక్‌మార్కెట్ నుంచి బయటకు తెచ్చి రైతులకు అందించాలి. గిట్టుబాటు ధర కల్పించాలి.
జెట్టి గురునాథరావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి
చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేయకుండా, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుకుంటున్నారు. ప్రజలను మోసం చేయకుండా ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేసేలా తన పోరాటాల ద్వారా జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారు. జగన్ పోరాటాల ఫలితంగానే తల్లికి వందనం, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు, రైతులకు యూరియా సరఫరాకు ప్రభుత్వం పూనుకుంది.
ఏలూరు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తున్న జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్, మాజీ ఎమ్మెల్యేలు వాసుబాబు, అబ్బయ్య చౌదరి, ఇన్‌చార్జి జేపీ తదితరులు
జంగారెడ్డిగూడెంలో వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, పార్లమెంట్ ఇన్‌చార్జి సునీల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే బాలరాజు, ఇన్‌చార్జ్‌లు విజయరాజు, రాజ్యలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి గురునాథరావు
ఏలూరు కలెక్టరేట్ వద్ద పార్టీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు
ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 12 ఉదయం 10 గంటల నుంచి ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన జరుగుతుందని జెడ్పీ సీఈఓ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు.
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా యూనిట్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ గత నెల 30న నోటిఫికేషన్ జారీ చేశారు. పరిపాలన కారణాలవల్ల ఆ నోటిఫికేషన్ రద్దు చేశామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఏలూరు (టూటౌన్): విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దని.. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఏలూరులో కొత్త బస్టాండ్ సమీపంలోని వంతెన వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదానీ మీటర్లు వద్దు.. పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.శ్రీనివాస్, ఆర్.లింగరాజు, డీఎన్‌వీడీ ప్రసాద్ మాట్లాడారు. గత ఎన్నికల ముందు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండని లోకేష్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజలపై భారంపడేలా స్మార్ట్ మీటర్లు ఏ విధంగా బిగిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే వ్యాపార సంస్థలకు, షాపులకు స్మార్ట్ మీటర్లు బిగించారని ఈ స్మార్ట్ మీటర్లతో బిల్లుల భారం పెరిగిందన్నారు. ఇప్పుడు గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, దొంగ చాటుగా ప్రజలు ఆమోదం లేకుండా మీటర్లు బిగించడం దుర్మార్గమన్నారు. బిగించిన స్మార్ట్ మీటర్లకు బిల్లు ఇవ్వడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ట్రూ ఆఫ్ చార్జీలు పేరుతో ప్రజలపై రూ.12 వేల కోట్లు భారం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పి.మంగరాజు, ఎస్.మహంకాళి రావు, తామా ముత్యాలమ్మ, నగర కార్యదర్శి పంపన రవికుమార్, నగర కమిటీ సభ్యులు వైఎస్ కనకారావు తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతకు అండగా

అన్నదాతకు అండగా

అన్నదాతకు అండగా

అన్నదాతకు అండగా

అన్నదాతకు అండగా

అన్నదాతకు అండగా

అన్నదాతకు అండగా

అన్నదాతకు అండగా

అన్నదాతకు అండగా

అన్నదాతకు అండగా