10న క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ సెమీస్
10న క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ సెమీస్
భీమవరం: భీమవరం పట్టణంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ సెమీఫైనల్స్ ఈ నెల 10న జరుగుతాయని కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు సోమవారం తెలిపారు. ప్రిన్సిపల్ కేవీ మురళీకృష్ణంరాజు, టెక్నాలజీ సెంటర్ హెడ్ ఎన్.గోపాలకృష్ణమూర్తితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఈ పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల్లోని 20 ఇంజనీరింగ్ కళాశాలల నుంచి 40 బృందాలకు సంబంధించి 240 మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు చెప్పారు. బుధవారం ఉదయం 8:30 గంటలకు కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో జరిగే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జేఎన్టీయూ కాకినాడ వైస్ చాన్స్‌లర్ సీఎస్‌ఆర్‌కె ప్రసాద్ హాజరవుతారని న్యాయ నిర్ణేతగా ఉన్నత విద్యా మండలి మాజీ వైస్ చైర్మన్, ఆంధ్ర యూనివర్సిటీ సీఎస్‌ఎస్‌ఈ విభాగం ప్రొఫెసర్ వి.వల్లికుమారి వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సెమీఫైనల్స్ పోటీల్లో విజేతలు ఈ నెల 13న జరిగే ఫైనల్స్ పోటీల్లో పాల్గొంటారని రీజనల్ సెంటర్ కోఆర్డినేటర్ పి.రవికిరణ్‌వర్మ తెలిపారు.
వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ ఇన్‌చార్జ్‌గా శ్రీనివాసరావు అదనపు పొగాకు విక్రయానికి అనుమతులు
కొయ్యలగూడెం: వర్జినియా అదనపు పొగాకు విక్రయానికి రైతులకు అనుమతులు ఇస్తున్నట్లు పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం పొగాకు వేలం కేంద్రానికి విచ్చేసిన ఆయన కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించి రైతు ప్రతినిధులతో సమావేశ ం నిర్వహించారు. ఈ సీజన్లో తక్కువ సుంకంతో అమ్ముకోవడానికి అనుమతి లభించిందని, రైతులు వచ్చే సీజన్‌కి ఈ పరిస్థితి ఉండకపోవచ్చన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్‌కి పోటీ పెరిగే అవకాశం ఉందని కావున రైతులు పరిమితికి మించి పండించరాదని నిర్దేశించిన కోటాకు కట్టుబడి ఉండాలని లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉందని సూచించారు. కార్యక్రమంలో ఉత్తర తేలిక నేలల ప్రాంతీయ అధికారి జీఎల్‌కే ప్రసాద్, వేలం నిర్వహణాధికారి గ్రేస్ మార్గరెట్, రైతు సంఘం అధ్యక్షుడు కాకర్ల వివేకానంద పాల్గొన్నారు.
పూర్ణానందంపేట(విజయవాడపశ్చిమ): వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా బీసీ సెల్ ఇన్‌చార్జ్‌గా గొలగాని శ్రీనివాసరావును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు ఏలూరు బీసీ సెల్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించడంతో ఆ పార్టీ బీసీ సెల్ నేతలు ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా గొలగాని శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బీసీ సెల్ ఏలూరు ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించడంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
1/1
10న క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ సెమీస్