
మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకున్న పోలీసులు
ద్వారకాతిరుమల: మండలంలోని గుణ్ణంపల్లి పంచాయతీ తక్కెళ్లపాడులో తాడిపూడి కాలువ గట్టుపై గ్రావెల్ మట్టి అక్రమ తవ్వకాలను ఆదివారం రాత్రి పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఒక జేసీబీని, టిప్పర్‌ను సీజ్ చేసి పోలీస్టేషన్‌కు తరలించారు. స్థానికుల కథనం ప్రకారం.. తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు కాలువ మట్టిని ఆదాయ వనరుగా ఎంచుకున్నాడు. రాత్రి వేళల్లో జేసీబీ సహాయంతో కాలువ గట్టుపై గ్రావెల్ మట్టిని తవ్వి, టిప్పర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నాడు. ఆ మట్టిని రిలయ్ ఎస్టేట్ వెంచర్లు చదును చేసేందుకు వినియోగిస్తున్నారు.