బాఽధితులకు సత్వర న్యాయం : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

బాఽధితులకు సత్వర న్యాయం : ఎస్పీ

Sep 9 2025 8:32 AM | Updated on Sep 9 2025 12:42 PM

బాఽధి

బాఽధితులకు సత్వర న్యాయం : ఎస్పీ

బాఽధితులకు సత్వర న్యాయం : ఎస్పీ మెడికల్‌ కాలేజీ భవనాల పరిశీలన స్కూటీతో నేరుగా ఆస్పత్రి వార్డుల్లోకి..

ఏలూరు టౌన్‌: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని, బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ పోలీసు అధికారులకు ఆదేశించారు. ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఫిర్యాదుల స్వీకరణలో పారదర్శకత కోసం పూర్తిగా పేపర్‌లెస్‌ విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్‌ చేసి ఆయా ఫిర్యాదుల పరిష్కారంపై ఆదేశాలిచ్చారు. మొత్తం 38 మంది తమ ఫిర్యాదులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ భవనాలను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం పరిశీలించారు. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏమి అవసరమో ఆయన వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే మెడికల్‌ కాలేజీ, జీజీహెచ్‌లో సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తామని, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీజీహెచ్‌కు చెందిన కొన్ని భవనాలను మెడికల్‌ కాలేజీ కోసం వినియోగిస్తున్నారని తెలిపారు. రెండు మూడు నెలల్లో మెడికల్‌ కాలేజీ భవనాలు పూర్తవుతాయని, అప్పుడు పూర్తిస్థాయిలో జీజీహెచ్‌కు సదుపాయాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. మంత్రి వెంట మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సావిత్రి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రాజు తదితరులు ఉన్నారు.

ఇష్టానుసారంగా కాంట్రాక్టర్‌ తీరు

పాలకొల్లు సెంట్రల్‌ : ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహారాన్ని కాంట్రాక్టర్‌ నేరుగా తన ద్విచక్ర వాహనంతో వార్డుల్లోకి తీసుకువెళ్లి అందించడంపై రోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడున్న ఒక వ్యక్తి ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో ఈ విషయం బహిర్గతమైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్న, రాత్రి వేళల్లో భోజనం కాంట్రాక్టర్‌ ద్వారా ఏర్పాటు చేస్తుంటారు. ఈ కాంట్రాక్టర్‌ గత కొంతకాలంగా ఆహారాన్ని నేరుగా వార్డుల్లోకి తన ద్విచక్ర వాహనంతో వెళ్లి సరఫరా చేస్తుండటం గమనార్హం. ఆస్పత్రి వైద్యాధికారులు ద్విచక్ర వాహనంతో లోపలికి రావద్దని వారించినా, తాను గత కొంతకాలంగా ఇలానే ఇస్తున్నానంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టు సమాచారం. సోషల్‌మీడియాలో ఈ విషయం వైరల్‌ కావడంతో ద్విచక్ర వాహనాన్ని వార్డు వద్ద పెట్టి.. లోపలికి పేషెంట్లను తీసుకెళ్లే వీల్‌ చైర్‌లో పెట్టుకుని తీసుకెళ్లడం గమనార్హం. మరి అత్యవసర సమయంలో వీల్‌ చైర్‌ అవసరమైతే ఏం చేస్తారని ఆసుపత్రికి వచ్చిన రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వైధ్యాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

బాఽధితులకు సత్వర న్యాయం : ఎస్పీ 1
1/1

బాఽధితులకు సత్వర న్యాయం : ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement