
రైతులపై కూటమి రాక్షసత్వం
బుట్టాయగూడెం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆ ది నుంచి రాక్షసత్వం ప్రదర్శిస్తోందని, ఎరువులు అ డిగితే ముఖ్యమంత్రితోపాటు మంత్రులు చులకగా మాట్లాడటమే నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మండిపడ్డారు. రైతు సమస్యలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈనెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద జరిగే అన్నదాత పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టరును బాలరాజు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తెల్లం రాజ్యలక్ష్మి దుద్దుకూ రులో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలరాజు మాల్లాడుతూ రాష్ట్రంలో ఎరువుల కొరత ప్రధాన సమస్యగా ఉందన్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్‌లో తరలించి కృత్రిమ సంక్షోభం సృష్టించారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ పాలనలో అన్నదాతలకు కొండంత అండగా నిలిచామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయన్నారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన అన్నదాత పోరు నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీరావు, పార్టీ సీనియర్ నాయకులు ఆరేటి సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, జెడ్పీటీసీ మొడియం రామతులసి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి ప్రసాద్, నాయకులు కలగర నాని, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.