
9న వైఎస్సార్‌సీపీ అన్నదాత పోరు
● యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం
● రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ ఉద్యమం
● పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచీ రైతన్నలకు కష్టాలు మొదలయ్యాయని, కనీసం ఎరువులు కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 9న ఏలూరులో చేపట్టే అన్నదాత పోరు నిరసన కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని, అన్నదాతల పక్షాన ఉద్యమిస్తామన్నా రు. 9న ఉదయం 10 గంటలకు ఏలూరు జిల్లాలో మూడు చోట్ల అన్నదాత పోరు నిరసన కార్యక్రమా లు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు ఆర్డీఓ కార్యాలయాల వద్దకు రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి, కొద్దిసేపు నిరసన అనంతరం ఆర్డీఓలకు వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే రైతులకు యూరియా సహా అవసరమైన ఎరువులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బ్లాక్ మార్కెట్‌ను నియంత్రిస్తూ, ఎరువులను పక్కదోవ పట్టిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలన్నారు. కనీసం పంటలకు గిట్టుబాబు ధరను కల్పించలేని దుస్థితిలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఎరువులను బ్లాక్ చేస్తూ వందల కోట్లు కాజేస్తున్నారని ఆరోపించారు. రైతులు ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని ఎద్దేవా చేశారు.
రైతు కష్టాలు పట్టవా?
ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ ఏలూరులో రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ అనంతరం నిరసన చేపడతామన్నారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. కూటమి ప్రభుత్వానికి రైతుల కష్టాలు పట్టించుకునే తీరిక లేదన్నారు. చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ మార్క్‌ఫెడ్‌కు ఇవ్వాల్సిన 50 శాతం యూరియాను తగ్గించి ప్రైవేట్‌కు కేటాయించడం దుర్మార్గమన్నారు. దీంతో యూరియా బ్లాక్ మార్కెట్‌కు వెళ్లి బస్తా రూ.450 నుంచి రూ.600కు విక్రయిస్తున్నారన్నారు. ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, వాణిజ్య విబాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా రామ్మోహనరావు, మైనార్టీ విభా గం కార్యదర్శి ఎస్‌కే గాజుల బాజీ, వాణిజ్య విభా గం కార్యదర్శి భాస్కర్ల వెంకట బాచి, విద్యార్థి విభా గం జిల్లా అధ్యక్షుడు పాతినవలస రాజేష్, వైఎస్సా ర్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాసరావు, జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు సముద్రాల దుర్గారావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా కార్యదర్శి కంచుమర్తి తులసీ, మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్ జాబ్, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, కామవరపుకోట మండల అధ్యక్షులు రాయకుల సత్యనారాయణ పాల్గొన్నారు.