
ప్లాస్టిక్ కవర్లకు నో ఎంట్రీ
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై ఈనెల 4న ‘సాక్షి’లో ప్రచురించిన ‘ప్లాస్టిక్‌పై సమరం.. ప్రచారానికే పరిమితం’ కథనంపై ఆలయ అధికారులు స్పందించారు. ప్లాస్టిక్ కవర్లు ఆలయంలోకి వెళ్లకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తులను క్షుణ్ణంగా పరిశీలించి లోనికి పంపిస్తున్నారు. అయితే ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో నిర్మూలించాలంటే క్షేత్రంలోకి కవర్లు రాకుండా చూడాలని పలు వురు అంటున్నారు. దేవస్థానానికి చెందిన కొ బ్బరికాయలు, ఫ్యాన్సీ దుకాణాల్లో కవర్ల వి క్రయాలను అరికట్టాలని కోరుతున్నారు.

ప్లాస్టిక్ కవర్లకు నో ఎంట్రీ