
యూరియా అందక గగ్గోలు
న్యూస్‌రీల్
పోషకాహారంతో ఆరోగ్యం
పోషకాహార లోప నివారణ, ఆరోగ్యకర జీవనశైలిని ప్రొత్సహించడానికి ఈ నెల 12 నుంచి అక్టోబరు 11 వరకు రాష్ట్రీయ పోషణ్ మాహ్‌ను ప్రారంభిస్తున్నారు. 8లో u
● నాయకుల సిఫార్సు ఉన్నవారికే యూరియా
● దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన
గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రైతును ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోంది. ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు దాటుతోంది. పంట దిగుబడి రావాలంటే పంటకు అవసరమైన కాంప్లెక్స్ ఎరువులతో పాటు యూరియా కూడా అవసరం. అయితే రైతులకు యూరియా అందడం గగనమైపోయింది. రెండో విడతలో యూరియా వేయాల్సి ఉండగా నెలా 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ రైతులకు యూరియా అందడం లేదు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులు యూరియా కోసం తిరగని చోటు ఉండడం లేదు. ఇటీవల పెదపాడు, వట్లూరు, వెంకటాపురం, దెందులూరు తదితర ప్రాంతాల్లో యూరియా దొరుకుతోందని తెలిసి అక్కడికి వెళ్ళిన ఏలూరు పరిసర ప్రాంతాల రైతులకు మొండి చేయి చూపారు. ఏలూరు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలకూ తిరిగినా ఎవరూ సమయానికి యూరియా అందించక పోవడంతో రైతులు దిగాలు పడ్డారు. బుధవారం ఏలూరు డీసీఎంఎస్ డిపోకు యూరియా వచ్చిందని తెలిసి రైతులు అధిక సంఖ్యలో ఆ డిపో వద్దకు చేరుకున్నారు. రైతులంతా ఒక్కసారిగా చేరుకోవడంతో తొక్కిసలాట కూడా జరిగింది. బుధవారం డీసీఎంఎస్ డిపోకు 18 టన్నుల యూరియా వచ్చింది. అయినప్పటికీ రైతుల పంటలకు అవసరమైనంత యూరియా ఇవ్వకుండా అధికారులు మోకాలడ్డారు. యూరియా కోసం డిపో వద్ద బారులు తీరిని రైతులకు కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటేనే యూరియా ఇస్తామని మెలిక పెట్టడంతో రైతులు ఆందోళనలో పడ్డారు. యూరియా రూ.267 ఉంటే కాంప్లెక్స్ ఎరువుకు రూ.1850 చెల్లించాల్సి వచ్చింది. మూడు కట్టలు కాంప్లెక్స్ కొంటేనే ఒక కట్ట యూరియా ఇస్తామనడంతో రైతులు కుదేలయ్యారు.
సిఫార్సు ఉన్నవారికే యూరియా
యూరియా కోసం స్వయంగా వచ్చిన రైతులకు యూరియా ఇవ్వని డీసీఎంఎస్ అధికారులు సిఫార్సులు ఉన్నవారికి మాత్రం ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చి పంపుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు చుట్టుపక్కల ఎన్నిసార్లు తిరిగినా తమకు యూరియా ఇవ్వడానికి నిరాకరించిన సొసైటీల పరిధుల్లోని రైతులకు మాత్రం ఇక్కడ ఎన్ని కావాలంటే అన్ని ఎలా ఇస్తారంటూ నిలదీశారు. ఏలూరు డీసీఎంఎస్ డిపోకు వచ్చిన ఎరువును ముందుగా ఏలూరు పరిసర ప్రాంతాలకు అవసరమైనంత ఇచ్చిన తరువాత మిగిలిన యూరియా మాత్రమే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన
సమయానికి యూరియా వేయకపోతే దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసిన నెల రోజుల్లోపు రెండు విడతలు యూరియా వేయాల్సి ఉండగా దాదాపు రెండు నెలలు కావస్తుండగా ఇప్పడు యూరియా సరఫరా చేస్తున్నారని, దీనివల్ల పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సుమారు 35– 38 బస్తాల దిగుబడి వచ్చిందని, ఈ ఏడాది సమయానికి యూరియా వేని కారణంగా దాదాపు 10 బస్తాల దిగుబడి తగ్గిపోతుందంటున్నారు.

యూరియా అందక గగ్గోలు

యూరియా అందక గగ్గోలు

యూరియా అందక గగ్గోలు

యూరియా అందక గగ్గోలు