
రైతు కష్టాలపై పోరుబాట
● ఈనెల 9న ఆర్డీవో కార్యాలయాల వద్ద నిరసన
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు
ఏలూరు టౌన్: రాష్ట్రంలో రైతుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి.. ఆఖరికి యూరియా సరఫరా చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. గత ఐదేళ్లూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రైతులకు వ్యవసాయం పండుగలా సాగిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పీఏసీ సభ్యులు, ఉంగుటూరు, నూజివీడు, చింతలపూడి సమన్వయకర్తలు పుప్పాల వాసుబాబు, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కంభం విజయరాజు, ఉమ్మడి జిల్లా జోనల్ మహిళా విభాగం అధ్యక్షురాలు మాకినీడి శేషుకుమారి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీఎన్నార్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 9న అన్ని ఆర్డీవో కార్యాలయాల వద్ద రైతులతో కలిసి నిరసన తెలిపి వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు. ఏలూరు, కై కలూరు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాలకు సంబంధించి ఏలూరులో నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లోని రైతులతో జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద, నూజివీడు నియోజకవర్గంలోని రైతులతో నూజివీడు ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన చేస్తారన్నారు.
రైతులకు బీమా అందించలేని దుస్థితి
ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌లో పరిహారం అందించేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రద్ద వహించిందని, నేడు కూటమి ప్రభుత్వంలో రైతులకు బీమా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్‌మార్కెట్‌లో యూరియా దొరుకుతుంది తప్ప... రైతులకు మాత్రం యూరియా అందుబాటులో లేదన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. నూజివీడు సమన్వయకర్త మేకా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడూ రైతులకు కష్టాలు, నష్టాలు తప్ప మంచి జరిగిన దాఖలాలు లేవన్నారు. కోఆపరేటివ్ సొసైటీలో యూరియా రూ.270కు విక్రయించాల్సి ఉండగా.. రూ.400కు విక్రయించటం చంద్రబాబు ప్రభుత్వానికి రైతుల
పట్ల చిత్తశుద్దికి నిదర్శనం అన్నారు. నూజివీడు మామిడిరైతులను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లాఽ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పొత్తూరు శ్రీనివాసరాజు, చేబోయిన వీర్రాజు, జిల్లా అధికార ప్రతినిధిలు మున్నుల జాన్ గురునాథ్, మొట్రు అర్జున్‌రావు(యేసుబాబు), ఇంజేటి నీలిమ, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆళ్ళ సతీష్ చౌదరి, షేక్ సయ్యద్ బాజీ, మోరంపూడి జగన్, జిల్లా కార్యదర్శులు మట్టిపల్లి సూర్యచంద్రరావు, బసవ వినయ్, కాసర్లపూడి జనార్ధన్, డీవీఆర్‌కే చౌదరి, బత్తిన మస్తాన్‌రావు, కంచుమర్తి తులసీ, పెదగర్ల స్వరూపరాణి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, మహిళా విబాగం కార్యదర్శి మంద జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.