
మళ్లీ పెరుగుతున్న గోదావరి
గత రెండు రోజులుగా గోదావరి వరద ప్రవాహం తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతోంది. బుధవారం సాయంత్రం భద్రాచలం వద్ద 42.10 అడుగులకు చేరుకుంది. 8లో u
నాకు ఒక ఎకరం పొలం ఉంది. మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. ఎకరానికి కనీసం ఒక కట్ట యూరియా వేయాలి. ఇక్కడ మూడు కట్టలు 20–20 తీసుకుంటేనే ఒక కట్ట యూరియా ఇస్తామంటున్నారు. ఈ లెక్కన నాకు మూడు ఎకరాలకి రూ.15 వేలకి పైగా పెట్టుబడి పెట్టాలి. ఈ సమయంలో అంత డబ్బు తీసుకురావడం ఏ రైతుకై నా కష్టమే.
– బీ వెంకటేశ్వర రావు, రైతు, పోణంగి
నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. పంట వేసిన నెల రోజులలోపు రెండు విడతలు యూరియా వేయాలి. తొలి విడత యూరియా వేసి నెలా 20 రోజులైంది. గత 20 రోజులుగా యూరియా ఎక్కడ ఇస్తున్నారని తెలిస్తే అక్కడికి వెళ్ళాను. స్థానికేతరులకు యూరియా ఇచ్చేది లేదని అక్కడి సొసైటీల వాళ్ళు తిప్పి పంపారు.
– సనకా ఆంజనేయులు,
కౌలురైతు సత్రంపాడు

మళ్లీ పెరుగుతున్న గోదావరి