
వాటా.. కోటాగా కూటమి ప్రభుత్వం
పెంటపాడు: ప్రజాపాలన విస్మరించి కూటమి ప్రభుత్వం తమ కార్యకర్తలకు కోటా.. వాటాగా పనిచేస్తోందని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమవర్శించారు. మంగళవారం జట్లపాలెంలోని ఎస్సీపేటలో వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కొట్టు మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి రాష్ట్రం దాకా కూటమి నేతలు కోటా, వాటాగా పంచేసుకుంటున్నారన్నారు. ప్రధానంగా జిల్లాలోని పలు ప్రాంతాలకు సంబందించి సీజన్ ఎరువులు గూడెం వస్తాయని, అయితే ఎరువుల ర్యాక్‌లను కూటమి నేతలు పంచుకుంటూ రైతుల సమస్యలను గాలికొదిలేశారన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కూటమికి తలొగ్గారన్నారు.
వైఎస్సార్ సీపీ పటిష్టతకు కృషి చేయాలి
వైఎస్సార్ సీపీ పటిష్టతకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా జగనన్న అందించిన పాలనను ప్రజలకు మళ్లీ అందించేలా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా పేదలకు పండ్లు పంపిణీ చేశారు.
మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శ