
అంగన్‌వాడీలతో సెల్‌గాటం
అంగన్‌వాడీ కేంద్రాలు
ఏలూరు పశ్చిమగోదావరి
జిల్లా జిల్లా
మెయిన్ కేంద్రాలు 1,959 1,556
మినీ కేంద్రాలు 206 70
మొత్తం 2,165 1,626
అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులు
పశ్చిమగోదావరి ఏలూరు
ఆరేళ్లలోపు పిల్లలు 43,783 41,116
మూడు నుంచి
ఆరేళ్లలోపు పిల్లలు 19,672 19,909
గర్భిణులు 8,596 7,889
బాలింతలు 6,170 5,606
మొత్తం 78,221 74,520
ఏలూరు (టూటౌన్): ‘సిగ్నల్స్ పని చేయవు.. యాప్స్ సపోర్టు చేయవు.. గతంలో 2జీ ఫోన్లు ఇచ్చారు.. ప్రస్తుతం 5జీ యాప్స్ అప్‌లోడ్ చేయమంటున్నారు.. యాప్‌ల సాకుతో ఫేస్ రికగ్‌నైజ్ కాకపోతే రేషన్ కట్ చేస్తామంటున్నారు.. ఇలాగైతే అంగన్ వాడీ కేంద్రాలను నడిపేది ఎలా.. తాము విధులు నిర్వర్తించేది ఎలా..’ అంటూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఫోన్లు అయినా ఇవ్వండి లేదా యాప్‌లను రద్దయినా చేయండి అంటూ అంగన్‌వాడీలు అధికారులను వేడుకుంటున్నారు. యాప్‌లపై కనీస శిక్షణ ఇవ్వకుండా, యాప్‌లను సపోర్టు చేసే ఫోన్లను అందించకుండా మెడపై కత్తి పెట్టి మరీ పనిచేయంటే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్ర మంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల వ్యాప్తంగా అంగన్‌వాడీలు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో సెల్‌ఫోన్లను అప్పగిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఐసీడీఎస్ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని పలు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రెండు జిల్లాల పరిధిలో 3,851 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, అదే సంఖ్యలో సహాయకులు పనిచేస్తున్నారు.
యాప్‌లలో అప్‌లోడ్ తిప్పలు
అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి కార్యకలాపాలను బాల సంజీవని, పోషణ ట్రాకర్ యాప్‌ల ద్వారా నిర్వహించాలి. ఫేస్ యాప్, ఫేస్ క్యాప్చర్, కేవైసీ, ఓటీపీ వంటి పనులు చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఫోన్లు సహకరించడం లేదు.
ఫేస్ క్యాప్చర్ అయితేనే..
యాప్‌లలో ఫేస్ క్యాప్చర్ అయితేనే అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు ఆహారం ఇవ్వాలి. దీంతో లబ్ధిదారులకు ముఖ ఆధారిత గుర్తింపుతో ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో కుటుంబంలో ఎవ రూ వచ్చినా రేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు లబ్ధిదారుడు తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్‌కు నిధులు తగ్గిస్తోంది. దీంతో అరకొర సౌకర్యాలతో సెంటర్లు నడుస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు యాప్‌లతో ఇబ్బంది పడుతున్నామని, సిగ్నల్స్ సరిగా లేక, సర్వర్ పనిచేయక తిప్పలు పడుతుంటే.. అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని అంగన్‌వాడీలు అంటున్నారు. పదో తరగతి చదివిన తమను యాప్‌లలో పనిచేయాలంటే ఎలా అని అంగన్‌వాడీలు ప్రశ్నిస్తున్నా రు. ఒక లబ్ధిదారుడి ఫేస్ క్యాప్చర్ చేయాలంటే రెండు, మూడు గంటల సమయం పడుతుందంటున్నారు. ఒక్కో కేంద్రంలో సగటున మూడేళ్లలోపు పిల్లలు 50 నుంచి 60 మంది, గర్భిణులు, బాలింతలు 10 నుంచి 15 మంది వరకు, ప్రీ స్కూల్ పిల్లలు 10 నుంచి 20 మంది, కిశోర బాలికలు 10 నుంచి 50 మందిలోపు ఉంటారని అంటున్నారు. వీరందరికీ ప్రతినెలా ఈకేవైసీ, ఓటీపీ, ఫేస్ క్యాప్చర్ చేయాలంటే సమయం సరిపోవడం లేదని అంగన్‌వాడీలు ఆవేదన చెందుతున్నారు.
యాప్‌ల కత్తి
సపోర్టు చేయని ఫోన్లతో ఇబ్బందులు
ముఖ ఆధారిత గుర్తింపుతోనే రేషన్
పనిచేయని యాప్‌లు.. అధికారుల ఒత్తిళ్లు
ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఫోన్ల అప్పగింత
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు