
జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు
నూజివీడు: ఉమ్మడి కృష్ణా జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక దంపతులపై గుడివాడలో ఇటీవల టీడీపీ మూకలు దాడి చేసి కారును ధ్వంసం చేసిన సంఘటనను నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తీవ్రంగా ఖండించారు. పెడనలో ఆదివారం ఉప్పాల హారిక దంపతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు. దాడి చేసిన దుండగులపై పోలీసులు కే సు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మీ వెంట ఉంటారని, ఏమాత్రం అధైర్యపడాల్సిన పనిలేదని హారిక దంపతులకు భరోసానిచ్చారు. ప్రతాప్ అప్పారావు వెంట జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, వైఎస్సార్‌సీపీ నూజివీడు మండల అధ్యక్షుడు పొలిమెట్ల శివ ఉన్నారు.