
నిమ్మ రైతులను ఆదుకోవాలి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కిలో నిమ్మ ధర రూ.100కు పైగా పలికింది. ఈ ఏడాది నిమ్మ ధర దిగజారి పోవడంతో సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో పెట్టుబడులు పెరిగి ఆర్థికంగా అప్పులు పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిమ్మ పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి.
రాయంకుల సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్, కామవరపుకోట మండలం
గిట్టుబాటు ధర కల్పించాలి
నిమ్మ తోట దిగుబడి రావడానికి పెట్టుబడి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దీంతో అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టాను. ఈ ఏడాది నిమ్మ ధర దిగజారి పోవడంతో ఆర్థికంగా అప్పులు పాలయే పరిస్థితి ఏర్పడింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాలి.
– మద్దుకూరి సత్యనారాయణ, ఈస్ట్ యడవల్లి, కామవరపుకోట మండలం

నిమ్మ రైతులను ఆదుకోవాలి