
సామాన్యులకు వెజిట్రబుల్స్
గణపవరం: కూరగాయల ధరలు సామాన్యులను కంగారు పుట్టిస్తున్నాయి. కిలో ఉల్లి రూ.20 నుంచి రూ.50కు చేరి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇదే బాటలో మిగిలిన కూరగాయల ధరలు ఉన్నాయి. సోమవారం గణపవరం సంతలో కిలో ధరలు ఇలా ఉన్నాయి. ఉల్లి రూ.40 నుంచి రూ.50, పచ్చిమిర్చి రూ.70, బీర రూ.60, వంకాయలు రూ.60, బెండ రూ.50, క్యారెట్ రూ.50, బీట్‌రూట్ రూ.50, దోస రూ.30, దొండ రూ.40, కాకర రూ.60, ఆకాకర రూ.80, కీరదోస రూ.80, కంద రూ.50, చిక్కుడు రూ.120, టమాట రూ.60, అల్లం రూ.120, మునగ రూ.10, ఆనబ రూ.30, బీన్స్ రూ.80, క్యాప్సికం రూ60, క్యాబేజీ రూ. 50, కాలిఫ్లవర్ రూ.50 చొప్పున పలికాయి. ఆకుకూరలు ధరలు అదేబాటలో ఉన్నాయి. తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర తదితర రకాలు కట్ట రూ.20 చొప్పున విక్రయించారు.