అపర భగీరథ.. అభివృద్ధి ప్రదాత | - | Sakshi
Sakshi News home page

అపర భగీరథ.. అభివృద్ధి ప్రదాత

Jul 8 2025 5:10 AM | Updated on Jul 8 2025 5:10 AM

అపర భ

అపర భగీరథ.. అభివృద్ధి ప్రదాత

పుణ్యక్షేత్రాల వైపు ఆర్టీసీ అడుగులు
ఆర్టీసీ ఆదాయం పెంచుకునే మార్గంలో పుణ్యక్షేత్రాల వైపు అడుగులు వేస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు బస్సు సర్వీసులను నడుపుతోంది. 8లో u

ట్రిపుల్‌ ఐటీలో కొరవడిన భద్రత

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో భద్రత కొరవడింది. శ్రీకాకుళం ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఉంటున్న హాస్టల్‌ గదులను అగంతకులు లూటీ చేశారు. 8లో u

మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, ఏలూరు: మెట్ట ప్రాంత అభివృద్ధికి బీజం వేశారు.. విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యతమిచ్చారు.. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి వ్యవస్థను గాడిలో పెట్టే బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. లక్షలాది ఎకరాలకు సాగునీరిచ్చి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి అపర భగీరథుడిగా రైతుల హృదయాల్లో నిలిచిపోయారు దివంగతం ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి. జిల్లాలో గిరిపుత్రులకు పోడుభూములకు పట్టాలిచ్చి సాగుదిశగా మళ్లించారు. ప్రతిష్టాత్మకమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏలూరులో ప్రారంభించి జిల్లాపై ఎనలేని అభిమానాన్ని చూపారు. ఆయన మరణించి ఏళ్లు గడుస్తున్నా జిల్లావాసుల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు.

తమ్మిలేరు వరదలను అడ్డుకునేలా..

2004–2009 వైఎస్సార్‌ హయాంలో జిల్లాలో అభివృద్ధి పరుగులు తీసింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం లభించింది. ఏలూరులో ముంపు సమస్యను తీర్చేలా 2005లో రూ.17 కోట్లతో తమ్మిలేరు రిటైనింగ్‌ వాల్‌కు శంకుస్థాపన చేయగా 2024లో వైఎస్‌ జగన్‌ హయాంలో రూ.90 కోట్లతో పూర్తయ్యింది. ఉమ్మడి పశ్చిమలో నూజివీడులో ట్రిపుల్‌ఐటీ, తాడేపల్లిగూడెంలో హార్టికల్చ ర్‌ యూనివర్సిటీ, పోలవరం ప్రాజెక్టు, చింతల పూడి ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనలు ఇలా కీలక ప్రాజెక్టులకు ఆయన హయాంలోనే అంకురార్పణలు జరిగాయి. జరిగాయి.

పోడుభూముల పంపిణీ : గిరిపుత్రులను వ్యవసాయం వైపు మళ్లించాలన్న ఉద్దేశంతో 2,200 మంది గిరిజనులకు 4,500 ఎకరాల పోడుభూములను పంపిణీ చేశారు. ఇప్పటికీ వేలాది మంది గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత వైఎస్‌ జగన్‌ హయాంలో 2,700 మంది గిరిజనులకు 3,500 ఎకరాల పోడు భూమిని పంపిణీ చేశారు.

చింతలపూడి ఎత్తిపోతల పథకం డెలివరీ పాయింట్‌

న్యూస్‌రీల్‌

రాజన్నా.. నిను మరువలేమన్నా..

మెట్ట సస్యశ్యామలంలో రాజన్న ముద్ర

నూజివీడులో ట్రిపుల్‌ఐటీతో విద్యావిప్లవం

తమ్మిలేరు రిటైనింగ్‌ వాల్‌కు చర్యలు

గిరిపుత్రులకు పోడు భూముల పంపిణీ

ఏలూరు సమగ్రాభివృద్ధికి బీజం

నేడు వైఎస్సార్‌ జయంతి

చింతలపూడి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం

చింతలపూడి ఎత్తిపోతల పథకానికి వైఎస్సార్‌ హయాంలో శంకుస్థాపన చేశారు. పూర్వ కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 15 మెట్ట ప్రాంతా మండలాల్లో 2.10 లక్షల ఎకరాల సాగునీరు అందించే లక్ష్యంతో రూ.1,701 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును ప్రారంభించారు. ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్న జంగారెడ్డిగూడెంలో 100 పడకల ఆస్పత్రి నిర్వాణానికి శంకుస్థాపన చేశారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో శాశ్వత రీతిలో నిలిచిపోయే కీలక అభివృద్ధి పనుల్లో రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు.

ట్రిపుల్‌ఐటీతో వెలుగు రేఖలు

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో భాగంగా రాష్ట్రంలో మూడు ట్రిపుల్‌ఐటీలను ప్రారంభించారు. నూజివీడులో 120 ఎకరాల విస్తీర్ణంలో ఏటా 2 వేల అడ్మిషన్లతో అధునాతన భవనాలను ట్రిపుల్‌ఐటీని ఏర్పాటుచేశారు. 6 వేల సీట్లతో ఇంటిగ్రేటెడ్‌ ఇంజనీరింగ్‌ కోర్సును ఇక్కడ పేద పిల్లలు చదువుతున్నారు. సుమారు 5 వేల మందికిపైగా విద్యార్థులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఉన్నత కొలువులు సాధించారు. అలాగే ఎన్‌ఐటీ, ఐఐటీ, ఐఐఎన్‌లో అడ్మిషన్లతో పాటు గ్రూప్‌–2 మొదలు పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌లో ఇంజనీర్లుగా సేవలందిస్తున్నారు.

ప్రాణదాత వైఎస్సార్‌

ముదినేపల్లికి చెందిన ఈ మహిళ పేరు నగడం రాములమ్మ. రోజువారి కూలి. 2007లో ఆమెకు ప్యాంక్రీయాసిస్‌ వ్యాధి రాగా రూ.లక్షకు పైగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెకు ఆరోగ్యశ్రీ అపర సంజీవనిలా ఆదుకుంది. విజయవాడలోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో ఆమెకు ఉచిత చికిత్స అందింది. అప్పటినుంచి తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనకు పునఃజన్మనిచ్చారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె తెలిపింది.

పోడు భూములకు పట్టాలిచ్చారు

నాకు 3.70 ఎకరాల పోడు భూమి ఉంది. పట్టాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగాను. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలువతో అటవీహక్కుల చట్టంలో నా భూమికి పట్టా ఇచ్చారు. నాతోపాటు మా గ్రామంలో మరో 35 కుటుంబాలకు కూడా వైఎస్సార్‌ హయాంలో పోడుభూములకు పట్టాలిచ్చారు. ఆయన్ను మేం దేవుడిగా కొలుచుకుంటున్నాం.

– ఎం.రవిభాస్కర్‌, పోడు వ్యవసాయ రైతు, లక్ష్మీపురం, బుట్టాయగూడెం మండలం

ఇంటి నిర్మాణానికి సాయం

వైఎస్‌ రాజశేఖరరెడ్డి వల్ల నాకు ఎంతో మేలు చేకూరింది. మాది పెరికెగూడెం గ్రా మం. నా పేరు పెరుమాళ్ల స త్యనారాయణ. నా భార్య పద్మ పెరికెగూడెం సర్పంచ్‌గా ఉంది. మాకు ఇద్దరు కుమారులు. మా ఇంటి నిర్మాణానికి రాజశేఖరరెడ్డి పాలనలో నాకు రూ.1.30 లక్షలు సాయం అందించారు. నాలా మా ఊరిలో చాలా కుటుంబాలు వైఎస్‌ రాజశేఖరరెడ్డి వల్ల లబ్ధి పొందాయి.

– పెరుమాళ్ల సత్యనారాయణ,

పెరికెగూడెం, మండవల్లి మండలం

అపర భగీరథ.. అభివృద్ధి ప్రదాత 1
1/6

అపర భగీరథ.. అభివృద్ధి ప్రదాత

అపర భగీరథ.. అభివృద్ధి ప్రదాత 2
2/6

అపర భగీరథ.. అభివృద్ధి ప్రదాత

అపర భగీరథ.. అభివృద్ధి ప్రదాత 3
3/6

అపర భగీరథ.. అభివృద్ధి ప్రదాత

అపర భగీరథ.. అభివృద్ధి ప్రదాత 4
4/6

అపర భగీరథ.. అభివృద్ధి ప్రదాత

అపర భగీరథ.. అభివృద్ధి ప్రదాత 5
5/6

అపర భగీరథ.. అభివృద్ధి ప్రదాత

అపర భగీరథ.. అభివృద్ధి ప్రదాత 6
6/6

అపర భగీరథ.. అభివృద్ధి ప్రదాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement