
పాఠశాలలు, రేషన్ షాపుల తనిఖీ
641 కిలోల గంజాయి ధ్వంసం
జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 641 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు వర్గాలు తెలిపాయి. 4లో u
ఏలూరు (టూటౌన్): జిల్లాలో పలు పాఠశాలలు, రేషన్ షాపులు, ఎంఎల్‌ఎస్ పాయింట్లను బుధవారం రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్త విజయప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏలూరు, భీమడోలు, ద్వారకాతిరుమల మండలాల్లో పర్యటించారు. తొలుత ఏలూరు జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో వంటశాల స్టోర్ రూమ్ పరిశీలించారు. కొన్ని గుడ్లు కేవలం 31 గ్రాముల ఉండడం గమనించి సప్లయర్‌ను సంప్రదించి తక్కువ బరువు ఉన్న గుడ్లను వెంటనే మార్చాలని, ఇకనుంచి ఇలాంటి పొరపాట్లు జరగకూడదని చెప్పారు. భీమడోలు మండలం గుండుగోలనులో రేషన్ షాపు, మండల పరిషత్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పాతూరు ఎమ్‌ఎల్‌ఎస్ పాయింట్ పరిశీలించారు. ద్వారకా తిరుమల మండలంలో బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. వంటశాల, స్టోర్ రూం తనిఖీలు నిర్వహించారు. 682 మంది విద్యార్థులకుగాను కేవలం నలుగురు వంటవాళ్లు మాత్రమే ఉన్నారని పాఠశాల ప్రిన్సిపల్ చైర్మన్ దష్టికి తీసుకురాగా ఈ విషయంపై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు.