టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక

Jul 10 2025 8:09 AM | Updated on Jul 10 2025 8:09 AM

టీడీప

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక

ఆగిరిపల్లి: ఆగిరిపల్లి మండలంలోని శోభనాపురం గ్రామంలో టీడీపీని వీడి రెండు కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. నూజివీడు నియోజకవర్గ తెలుగు యువత సభ్యుడు పెనుముచ్చు మహేష్‌, కాకి భాగ్యరాజు కుటుంబ సభ్యులు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీ నాయకులు బోయపాటి శ్రీనివాసరావు, రావి విష్ణువర్ధన్‌రావుల సమక్షంలో కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో దళిత నాయకులంటే చిన్న చూపని, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని త్వరలోనే తెలుగుదేశం పార్టీకి దళితుల సత్తా ఏంటో చూపిస్తామని, నూజివీడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సీపీ బలోపేతానికి శాయిశక్తుల కృషి చేస్తామని పెనుముచ్చు మహేష్‌, కాకి భాగ్యరాజు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు దాసరి రామారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు నక్కనబోయిన సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

బ్యాంకు ఉద్యోగుల నిరసన

ఏలూరు (టూటౌన్‌): సార్వత్రిక సమ్మెకు మద్దతుగా బుధవారం నాడు బ్యాంకు ఉద్యోగులు సామూహిక ప్రదర్శనలు నిర్వహించారు. ఆర్‌ఆర్‌పేట యూనియన్‌ బ్యాంక్‌ ప్రాంతీయ కార్యా లయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు, ఏలూరు చుట్టు పక్కల బ్యాంకు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం అధ్యక్షుడు దుగ్గిరాల శ్రీనివాస్‌ మోహన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనం పేరుతో బ్యాంకింగ్‌ సెక్టార్‌ను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. కార్మిక వర్గం ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ 44 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో యూనియన్‌ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకుడు లక్ష్మణరావు, ఇండియన్‌ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకుడు రామకోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై నిరసన

చింతలపూడి: చింతలపూడి మండలం శెట్టివారిగూడెం–వెంకటాపురం గ్రామానికి అనుసంధానంగా ఉన్న రోడ్డును తక్షణం నిర్మించాలని కోరుతూ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై బుధవారం గ్రామస్తులు టెంట్‌ వేసి నిరసనకు దిగారు. గతంలో గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే కాంట్రాక్టర్‌ హైవే నిర్మాణం సమయంలో రోడ్డు ధ్వంసం అవ్వడంతో ప్రత్యా మ్నాయంగా తమ గ్రామాల మధ్య రోడ్డు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టక పోవడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో నిరసన చేపట్టామని గ్రామస్తులు తెలిపారు. మాట ఇచ్చి వారికి సంబంధం లేనట్టుగా ప్రవర్తించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ధ్వంసం చేయడంతో సుమారు 600 ఎకరాలకు దారి లేకుండా పోయిందని వాపోయారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సతీష్‌ కుమార్‌ సంఘటనా స్ధలానికి చేరుకుని కాంట్రాక్టర్‌, గ్రామస్తులతో చర్చలు జరిపారు.

అక్షరాస్యత పెంచేందుకు కృషి చేయాలి

ఏలూరు(మెట్రో): వయోజనుల్లో అక్షరాస్యత పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ఉల్లాస్‌–అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టర్‌ బంగ్లాలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి ఉల్లాస్‌ – అక్షరాంధ్ర జిల్లా స్థాయి అధికారులతో సమావేశం జరిగింది. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 100 గంటల శిక్షణతో ఈ ఏడాది 97,200 నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ఉల్లాస్‌–అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు.

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక 
1
1/1

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement