
టీడీపీ మూకల అరాచకం
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని పల్లెర్లమూడిలో మంగళవారం రాత్రి నిర్వహించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి కార్యక్రమంలో టీడీపీ మూకలు అడుగడుగునా రెచ్చగొట్టి గొడవలకు విశ్వప్రయత్నాలు చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ముందుకు సాగగా చివరకు వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను చించివేశారు. ఇంత జరిగినా పట్టించుకోని పోలీసులు బుధవారం మాత్రం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పోలిమెట్ల శివను ఉదయం నుంచి పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. వైఎస్ జయంతి సందర్భంగా పల్లెర్లమూడిలో కేక్ కటింగ్ ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావును ఆహ్వానించారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో రాట్నాలగూడెంలో కేక్ కట్‌చేసి అక్కడి నుంచి పల్లెర్లమూడి వెళ్లారు. పల్లెర్లమూడిలోకి ర్యాలీ ప్రవేశించిన దగ్గర నుంచి రాటాలు అనే అతను ట్రాక్టర్‌తో ర్యాలీ చేస్తున్న వారిని గుద్దించాలని మీదకు పోనిచ్చాడు. పక్కన వాళ్లు లాగడంతో బతికి బయటపడ్డారు. పల్లెర్లమూడిలోని దళితవాడకు వెళ్లి అక్కడ వైఎస్ విగ్రహానికి ప్రతాప్ అప్పారావు పూలమాల వేసి కేక్ కట్ చేసిన అనంతరం శివాలయం సెంటర్‌కు ర్యాలీగా రాగా అక్కడ డీజే బండికి బైక్‌లు అడ్డం పెట్టడంతో పాటు మహిళలను అడ్డం కూర్చోబెట్టి కులంపేరుతో వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను దూషించారు. ర్యాలీని అడ్డుకొని అరాచకంగా వ్యవహరించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, వైఎస్సార్‌సీపీ నాయకులు వచ్చి ఘర్షణ వాతావరణం పెరగకుండా అడ్డుకున్నారు. టీడీపీ మూకలు గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను చించివేశారు. దాడిలో గాయపడ్డ నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చేశారు. గ్రామంలోని టీడీపీ ఫ్లెక్సీలను చించారంటూ బుధవారం ఉదయం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పోలిమెట్ల శివను పోలీసులు తీసుకొచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. దీనిపై జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు శీలం రాము, మండలంలోని, పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
కవ్వింపునకు పాల్పడిందే టీడీపీ వాళ్లే..
కవ్వింపు చర్యలకు దిగి రెచ్చగొట్టింది టీడీపీ వాళ్లేనని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు రూరల్ సీఐకు తెలిపారు. పోలిమెట్ల శివను స్టేషన్‌కు తీసుకురావడంతో ఆయన స్టేషన్‌కు వచ్చారు. బైక్ ర్యాలీ చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్తుంటే రాటాలు అనే అతను ట్రాక్టర్‌తో గుద్దించడానికి ప్రయత్నించాడని చెప్పారు.
వైఎస్సార్ జయంతి ర్యాలీకి ట్రాక్టర్ అడ్డుపెట్టి కవ్వింపు చర్యలు
పల్లెర్లమూడిలో వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీల చించివేత

టీడీపీ మూకల అరాచకం