మరపురాని మహానేత | - | Sakshi
Sakshi News home page

మరపురాని మహానేత

Jul 9 2025 7:07 AM | Updated on Jul 9 2025 7:07 AM

మరపుర

మరపురాని మహానేత

బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, ఏలూరు: జనహృదయ నేత దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 76వ జయంతిని ఏలూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అభివృద్దికి ఆ మహానేత చేసిన సేవలు స్మరించుకుని నివాళులర్పించారు. వాడవాడలా వైఎస్సార్‌ విగ్రహాలకు పూల మాలలు వేసి కేక్‌లు కట్‌ చేశారు.

రక్తదాన, అన్నదాన శిబిరాలతో పాటు చీరలు, దుప్పట్లు, పండ్ల పంపిణీ సేవా కార్యక్రమాలతో అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ పేదల సంక్షేమమే పరమావధిగా ఆయన పాలనను కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఇందిరమ్మ ఇళ్లు, 108 వంటి పథకాల లబ్ధితో పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.

రాజన్న స్మృతిలో..

ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్‌ నేతృత్వంలో ఏలూరులో 10 ప్రాంతాల్లో 8 వేల మందికి అన్నదానం నిర్వహింశారు. నగరంలోని అన్ని ప్రధాన సెంటర్లల్లో ఉన్న మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పండ్లు పంపిణీ చేయడంతో పాటు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

● నూజివీడు నియోజకవర్గంలో వైఎస్సార్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. నూజివీడులోని చినగాంధీబొమ్మ సెంటరులో వైఎస్సార్‌ జయంతి వేడుకలు నియోజకవర్గ ఇన్‌చార్జి మేక వెంకట ప్రతాప అప్పారావు ఆధ్వర్యంలో జరిగాయి. ఆయన కేక్‌ కట్‌ చేసి, అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

● దెందులూరులో నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొఠారు అబ్బయ్యచౌదరి క్యాంపు కార్యాలయంలో, పెదపాడు మండలం అప్పనవీడులో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

● పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయగూడెంలో వైఎస్సార్‌ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సీహెచ్‌సీలో రోగులకు పాలు, పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కొయ్యలగూడెం, టీ.నర్సాపురం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో జరిగిన వైఎస్సార్‌ జయంతి కార్యక్రమాల్లో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

● ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పుప్పాల వాసుబాబు వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. నిడమర్రు, భీమడోలు, ఉంగుటూరు మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

● చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం, జంగారెడ్డిగూడెం కామవరపుకోటల్లో జరిగిన వైఎస్సార్‌ జయంతి కార్యక్రమాల్లో నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

● కై కలూరు నియోజకవర్గం కై కలూరులో వైఎస్సార్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కై కలూరు సంత మార్కెట్‌ వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కై కలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి దూలం నాగేశ్వరరావు కుమారుడు వినయ్‌ కేక్‌ కట్‌ చేశారు. రాష్ట్ర ముదిరాజుల సంఘ అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

ఊరూరా వైఎస్సార్‌కు ఘన నివాళులు

అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా జయంతి వేడుకలు

ఏలూరులో 10 ప్రాంతాల్లో అన్నదానం

దెందులూరులో రక్తదాన శిబిరం

మరపురాని మహానేత 1
1/5

మరపురాని మహానేత

మరపురాని మహానేత 2
2/5

మరపురాని మహానేత

మరపురాని మహానేత 3
3/5

మరపురాని మహానేత

మరపురాని మహానేత 4
4/5

మరపురాని మహానేత

మరపురాని మహానేత 5
5/5

మరపురాని మహానేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement