కౌన్సిల్‌లో ప్రొటోకాల్‌ పాటించేలా చూడాలి | - | Sakshi
Sakshi News home page

కౌన్సిల్‌లో ప్రొటోకాల్‌ పాటించేలా చూడాలి

Jul 8 2025 5:10 AM | Updated on Jul 8 2025 5:10 AM

కౌన్సిల్‌లో ప్రొటోకాల్‌ పాటించేలా చూడాలి

కౌన్సిల్‌లో ప్రొటోకాల్‌ పాటించేలా చూడాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల్ల పట్ల ప్రొటోకాల్‌ పాటించడం లేదని, కౌన్సిల్‌లో మాట్లాడే అవకాశం కల్పించడం లేదని, నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం వైఎస్సార్‌సీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ మామిళ్లపల్లి జయప్రకాష్‌ (జేపీ) ఆధ్వర్యంలో కార్పొరేటర్లు కలెక్టర్‌ వెట్రిసెల్వికి వినతిపత్రం సమర్పించారు. జేపీ, కార్పొరేటర్లు మాట్లాడుతూ ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. ప్రజాసమస్యలు చర్చించకుండా అడ్డుకుంటున్నారని, చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాల్లో కో–ఆప్షన్‌ సభ్యులు మాట్లాడేందుకు అనుమతి లేకపోయినా సభా మర్యాద పాటించకుండా ప్రతిపక్ష సభ్యులను టార్గెట్‌ చేసుకుని విమర్శలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి స్థానిక కార్పొరేటర్లకు కనీస సమాచారం ఇవ్వడం లేదని వీటిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు గుడిదేశీ శ్రీనివాసరావు, నెరుసు చిరంజీవులు, గంట మోహన్‌ రావు, మున్నుల జాన్‌ గుర్నాథ్‌, నూకపెయ్యి సుధీర్‌ బాబు, తుమరాడ స్రవంతి, జి.విజయనిర్మల, కేదారేశ్వరి డింపుల్‌ తదితరులు ఉన్నారు.

రెయిలింగ్‌కు అనుమతివ్వాలి

ఏలూరులోని ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో 2010లో ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద గ్రానైట్‌, రెయిలింగ్‌ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని పార్టీ ఇన్‌చార్జి జయప్రకాష్‌ (జేపీ) ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. 2023లో కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో విగ్రహం చుట్టూ అభివృద్ధి పనులు, రెయిలింగ్‌ పనులు మొదలుపెట్టారని, అయితే అనివార్య కారణాల వలన పనులు నిలిపివేశారన్నారు. దీంతో వైఎస్సార్‌ అభిమానులు విగ్రహం వద్ద కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఇబ్బంది పడుతున్నారన్నారు. విగ్రహం వద్ద గ్రానైట్‌, రెయిలింగ్‌ పనులు చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు.

వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి జేపీ వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement